విడాకులు తీసుకున్న హీరో..ఆ నటితో ఎఫైరే కారణమా..?
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. తాజాగా ఓ సీరియల్ నటుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ నటితో ఎఫైర్ కారణంగానే అతను తన భార్యకు విడాకులు ఇచ్చారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ముద్దమందారం సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ సాయి.

తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ సాయి..చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. మధుమిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ సాయికి ఓ బాబు కూడా ఉన్నాడు. తాజాగా అతను తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ సాయి తన భార్యతో విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే పవన్ సాయి తన భార్యతో విడిపోవడానికి ఓ నటితో అతను పెట్టుకున్న ఎఫైరే కారణమని తెలుస్తోంది. సీరియల్‌లో తనతో నటించే అమ్మాయితో పవన్ సాయి ఎఫైర్ పెట్టుకోవడం వల్లనే గొడవలు వచ్చి , విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. పవన్ సాయి ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించారు.
ఆ సమయంలో ఓ అభిమాని పవన్ సాయిని అన్న వదిన మధుమిత ఎలా ఉందని ప్రశ్నించాడు. దీనికి పవన్ సాయి బదులిస్తూ.. నా చూట్టూరా ఎవరు లేరు..నేను ఒంటరి వాడిని..నాది ఒంటరి జీవితం.. నాతో ఎవరు లేరని చెప్పాడు. దీంతో పవన్ సాయి భార్యకు విడాకులు ఇచ్చారని అందరు భావిస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ.. పవన్ సాయి విడాకులకు సంబంధించిన వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications