మహేష్ బాబు ఇంట శుభకార్యం: కన్నతల్లి కోర్కెను తీర్చబోతున్న మహేశ్ బాబు!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో త్వరలో ఒక శుభకార్యం జరగబోతుంది. ఇటీవల కాలంలో మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఆయన కుటుంబంలో ఓ శుభకార్యాన్ని నిర్వహించాలని మహేష్ బాబు ఫ్యామిలీ భావిస్తుందని తెలుస్తుంది.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. కుటుంబానికి కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే హీరో. షూటింగులు లేనప్పుడు మహేష్ బాబు కుటుంబంతో గడుపుతూ ఉంటారు. ఆయన ఫ్యామిలీతో ప్రతీ సంవత్సరం ఫారిన్ టూర్లు వేస్తూ ఉంటారు. ఆయన తీసే సినిమాలు కూడా కుటుంబం మొత్తం చూసే విధంగానే ఉంటాయి. కుటుంబంతో ఎంతో అనుబంధాన్ని పెనవేసుకున్న మహేష్ బాబు ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులను అన్నను కోల్పోయిన బాధ నుండి బయట పడుతున్నాడు.

అయితే ఈ క్రమంలో మహేష్ బాబు తన తల్లి కోరిక తీర్చాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ మహేష్ బాబు తల్లి కోరిక ఏమిటి? మహేష్ బాబు ఇంట్లో జరగబోతున్న ఫంక్షన్ ఏమిటి? అంటే.. మహేష్ బాబు తల్లి కోరిక మేరకు మహేష్ బాబు తన ఇంట్లో ఒక శుభకార్యాన్ని జరుపబోతున్నారు.
మహేష్ బాబు కూతురు సితార లంగా,వోణి ఫంక్షన్ ను నిర్వహించాలని మహేష్ బాబు కుటుంబం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనవరాలు సితార లంగా, వోణీ ఫంక్షన్ ను చూడాలని, ఆ వేడుకను ఘనంగా జరపాలని మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బ్రతికున్నప్పుడు కోరుకున్నారట.
అయితే ఈ వేడుకను ఆమె చూడకుండానే కన్నుమూయడంతో, ఇప్పుడు తన తల్లి కోరికను తీర్చడం కోసం మహేష్ బాబు ఇంట్లో ఫంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ ఫంక్షన్ కు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. తల్లి కోరిక తీరేలా అంగరంగ వైభవంగా మహేష్ బాబు ఫ్యామిలీ ఈ వేడుకను జరపనుంది.












Click it and Unblock the Notifications