స్టార్ కమెడియన్లు కత్తులు పడితే.. సత్య, యోగిబాబు 'గోల్డెన్ భాగ్యం' గ్లింప్స్ రిలీజ్..
తెలుగులో కమెడియన్లు అనేకం.. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. టాలీవుడ్ లో ఉన్నంతమంది కమెడియన్లు మరే ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి. అయితే ఇటీవలికాలంలో టాలీవుడ్ లో తన టైమింగ్, హావభావాలతో భారీ క్రేజ్ సంపాదించుకున్న నటుడు సత్య.. అలా తెలుగులో స్టార్ కమెడియన్ గా మారారు. అలాగే అటు తమిళ్ లో స్టార్ కమెడియన్ గా యోగిబాబు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో మల్టీ స్టారర్ గా నటిస్తే ఎలా ఉంటుంది..? జోష్ డబుల్ అవుతుంది కదా.. అదే జరిగింది. సత్య- యోగిబాబు ఇద్దరూ కలిసి తెలుగు - తమిళ్ కామెడీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఆ మూవీనే గోల్డెన్ భాగ్యం.. ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా రిలీజైంది. గ్లింప్స్ చాలా అద్భుతంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తోంది.
రంగబలి సినిమా దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాపిరెడ్డి అలాగే పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా సత్య, యోగిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. తమిళనాడులో ఇడ్లీ సాంబార్.. తెలుగులో బిర్యానీ థంబ్స్ అప్ ఫేవరెట్ వంటకాలతో ఈ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ గ్లింప్స్ లో అటు సత్య- ఇటు యోగిబాబు ఇద్దరూ తెల్లని చొక్కా, పంచెకట్టుతో అలరిస్తున్నారు. ఈ మూవీలో కామెడీతోపాటు క్రైమ్ యాక్షన్ కూడా ఉండబోతుందని గ్లింప్స్ తో చెప్పారు. దీంతో ఇద్దరు స్టార్ కమెడియన్స్ హీరోలుగా చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

ఇక 'గోల్డెన్ భాగ్యం' మూవీని కేవలం తెలుగు లేదా తమిళ చిత్రంగా కాకుండా.. రెండు భాషలకు చెందిన నటీనటులు, సంస్కృతులను మేళవిస్తూ రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. 'ఇది తెలుగు, తమిళ సినిమా కాదు.. 'తెలుమిళ్ సినిమా' అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఈ కాన్సెప్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications
