జాక్ పాట్ కొట్టేసిన బబుల్ బ్యూటీ!
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఏ ముహూర్తాన దీన్ని ప్రారంభించారో కానీ పడుతూ లేస్తూ షూటింగ్ జరుపుకుంది. బ్యాలెన్స్ వర్క్ ఉంటే దాన్నికూడా చిత్ర బృందం పూర్తిచేస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
టాలీవుడ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి సైలెంట్ గా దూసుకుపోతోందంటున్నారు. మొన్నటి వరకు మీనాక్షి చౌదరి అనే పేరు సినీ ప్రేమికులకు పెద్దగా తెలిసేదికాదు. ఎప్పుడైతే గుంటూరు కారం సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపికైందో అప్పటినుంచి ఆమె పేరు మార్మోగిపోతోంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కించుకోవడం చిన్న విషయేం కాదు.

తాజాగా ఈ అమ్మడు మరో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒక హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుగు ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. మీనాక్షి చౌదరి జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో మూడు సినిమాలు, తెలుగు సినీ ఇండస్ట్రీలో రెండు సినిమాలను ఈ బ్యూటీ ఒప్పుకుంది. తాజాగా రామ్ చరణ్ తో సినిమా కూడా ఒప్పుకోవడంతో ఓ రేంజ్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. శ్రీ లీల తర్వాత అంతటి బిజీగా మీనాక్షి చౌదరి ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications