ఓటీటీలో గుంటూరు కారం హంగామా.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో ఈవారం రచ్చ ఇలా!!
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. థియేటర్లలో రికార్డుల మోత మోగించిన గుంటూరు కారం సినిమా నేటి నుంచి ఓటిటీ లో సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో థియేటర్లలో సినిమాల హంగామా కంటే ఓటీటీ లో వచ్చే సినిమాల హంగామా విపరీతంగా పెరిగింది.
థియేటర్లో విడుదలైన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటిటీ లోను స్ట్రీమింగ్ కు రావడంతో చాలామంది ఓటీటీ లలో సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో వచ్చే సినిమాలకంటే, OTT లో వచ్చే సినిమాల మీద ప్రస్తుతం జనాల ఫోకస్ మారింది. ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తుంది.

జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సందడి తెచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో గుంటూరు కారం సినిమా ఓటీటీలో నేటి నుంచి అందుబాటులో ఉంటుంది.
ఇదిలా ఉంటే నేటినుంచి వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఏకంగా 18 సినిమాలు వెబ్ సిరీస్ సందడి చేయనున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి గుంటూరు కారం సినిమాతో పాటు, హిందీ క్రైమ్ థ్రిల్లర్ భక్షక్, లవర్ స్టాకర్ కిల్లర్ డాక్యుమెంటరీ సిరీస్, యాషెస్ టర్కీ సిరీస్, కొరియన్ సిరీస్ ఏ కిల్లర్ పారడాక్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. హారిబుల్ బాసెస్ రేపు స్ట్రీమింగ్ కు రానుంది.
మరోవైపు నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో కెప్టెన్ మిల్లర్ (తెలుగు డబ్బింగ్ మూవీ) స్ట్రీమింగ్ కానుండగా, సన్ నెక్ట్స్‌లో నేటినుంచి లేటెస్ట్ మూవీ అయలాన్ (తెలుగు డబ్బింగ్) స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో ఆర్య వెబ్ సిరీస్ అంతిమ్ వార్ సీజన్ 3 కానుంది.జీ5 ఓటిటీ లో కాటేరా కన్నడ డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.












Click it and Unblock the Notifications