హనుమాన్ 'రివ్యూ' .. బొమ్మ బ్లాక్ బ్లాస్టర్ ..!
భారీ వివాదాల నడుమ ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా 'హనుమాన్'. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సంక్రాంతి కానుకగా 'హనుమాన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులోనే అనుకున్నంత స్థాయిలో థియోటర్లు దొరక్కపోవడం పెద్ద సమస్యగా మారింది. అయిన ఎక్కడ నిరాశ చెందకుండా సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేసి గట్టిగానే పబ్లిసిటీ చేశారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి సైతం హనుమాన్‌కు అండగా నిలవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 'హనుమాన్' సినిమాకు ప్రీమియర్స్ షోస్ వేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం వేసిన ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మూవీ చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఉందని చెబుతున్నారు. సినిమాలో ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో డ్రామా, ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ అన్ని యాంగిల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక సినిమాలో వీఎఫ్ఎక్స్ అదిరిపోయేల ఉన్నాయని, 'హనుమాన్'కు అదే పెద్ద బలమని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

అయితే సెంకడాఫ్ నిడివి కాస్త తగ్గి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా భారం మొత్తం తేజ తన భూజలపై మోసాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని సినిమా చూసిన వారు చెబుతున్నారు.

తేజ సజ్జా చాలా మేచ్యూర్ యాక్టింగ్‌తో 'హనుమాన్'ను మరో లేవల్‌కు తీసుకువెళ్లడాని సమాచారం. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ తన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందని చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే వినయ్ రాయ్, సముద్రఖనిలు అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రీమియర్స్ షోస్ చూసిన తరువాత ప్రేక్షకులు చెప్పిన దానిబట్టి ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చిన 'హనుమాన్' పెద్ద హిట్ కొట్టడం ఖయంగా కనిపిస్తోంది. రేపు పూర్తి స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.












Click it and Unblock the Notifications