హోటల్ లో నాగార్జునతో గొడవపడ్డ స్టార్ హీరో
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివతో పరిశ్రమకు పరిచయం అయ్యారు. వర్మతో పలు సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు. విభిన్నమైన క్యారెక్టర్లలో నటించి అందరిమెప్పు పొందేవారు. ప్రస్తుతం ఆయన సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే దయా అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. కొత్త సినిమాలు ప్రకటించాల్సి ఉంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ చక్రవర్తి నాగార్జునతో జరిగిన గొడవ గురించి వివరించారు. తాను ఓ హోటల్ లోపలికి వెళుతున్నానని, అదే సమయంలో నాగార్జున బయటకు వస్తుండగా తన భుజం నాగార్జునను తాకిందన్నారు. అయినా తాను క్షమాపణలు చెప్పలేదని, నాగార్జున కోపంగా చూసి వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. తన తప్పు లేకపోయినా తిట్టారని, ఎందుకు తనకు సారీ చెప్పాలనిపించలేదన్నారు. అయితే తాను సారీ చెబితే అక్కడితో గొడవ అయిపోయేదన్నారు. అలా చేయకపోవడంవల్ల నాగార్జున కోపానికి గురికావాల్సి వచ్చిందని జేడీ చెప్పారు.

తనను సినిమాలోకి తీసుకోవడమే చాలా ఎక్కువ అని, భుజం తగిలినా సారీ చెప్పలేదని, కొద్దికాలానికి ఇద్దరం ఒకచోట కలిశామన్నారు. పాత విషయాలన్నీ మరిచిపోయి తనతో ఎంతో స్నేహంగా నాగార్జున మాట్లాడారని, చాలా మంచి వ్యక్తి అని, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని జేడీ నాగార్జునను కొనియాడారు. అప్పటినుంచి తాను నాగార్జున ఫ్యాన్ అయ్యానన్నారు.
నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రం చేస్తున్నారు. ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. దీనితర్వాత తమిళ దర్శకుడు నవీన్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత తారాగణాన్ని ఎంపిక చేయనున్నారు.












Click it and Unblock the Notifications