త్రిష వల్లే పెళ్లికి దూరంగా ఉంటున్న ప్రభాస్
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తన సినిమాలు వరుసపెట్టి సంచలన విజయాలు సాధిస్తున్నప్పటికీ పెళ్లికి సంబంధించిన వార్త మాత్రం చెప్పడంలేదని అభిమానులు రుసరుసలాడుతున్నారు. పెళ్లిపై ఎన్నో సందర్భాల్లో విలేకరులు ప్రశ్నిస్తున్నప్పటికీ వాటినుంచి ప్రభాస్ తప్పించుకునేవారు. ఆయన పెళ్లిపై ఎన్నోరకాల వార్తలు చక్కర్లు కొడుతుంటాయికానీ వాటిల్లో ఏదీ నిజం కాదని అభిమానులకు కూడా తెలుసు. ప్రస్తుతం అనుష్కతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే ఇది.
నిశ్చితార్థం జరిగిందనుకునేవారు
సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది హీరోలు, హీరోయిన్లతోపాటు పేరున్న నటుల వ్యక్తిగత జీవితాలను దగ్గర నుంచి చూశారు ప్రముఖ సినీ జర్నలిస్టు ఈమంచి రామారావు. ఇటీవలే ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రభాస్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. అనుష్కతో సాన్నిహిత్యంకన్నా ముందే త్రిషతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడన్నారు. వీరి కాంబినేషన్ లో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయిందని చాలామంది భావించేవారు.

ఊహించనిరీతిలో విడిపోయారు
త్రిషతో నిశ్చితార్థం జరిగితే వేలికి తొడిగించేందుకు అత్యంత ఖరీదైన ఉంగరాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా, ఎవరూ ఊహించనిరీతిలో వీరిద్దరూ విడిపోయారు. అలా విడిపోవడానికి కారణం త్రిష. తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అంత సన్నిహితంగా ఉండటం ప్రభాస్ కు నచ్చలేదు. ఇదే విషయమై త్రిషను మందలించారు. పరిశ్రమలో కొనసాగుతున్నప్పుడు ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలి అని త్రిష భావిస్తుండేది.
అయితే ప్రభాస్ ఇలా మందలించడం ఆమెకు నచ్చలేదు. తన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నట్లు భావించారు. అయితే తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని డార్లింగ్ కూడా భావించాడు. అప్పటినుంచి త్రిషకు దూరంగా ఉండటంతోపాటు పెళ్లికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఈమంచి రామారావు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications