రుషికొండ భవనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
రుషికొండ భవనాల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత వీటి వినియోగం పైన సూచనలకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పలువురి అభిప్రాయాలు సేకరించిన సబ్ కమిటీ.. వినియోగం పైన ఒక నిర్ణయానికి వచ్చింది. ఆతిథ్య రంగానికి కేటాయించాలని భావించింది. ఈ సమయంలో రుషికొండ భవనాల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. భవనాల వినియోగంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
విశాఖలోని రుషికొండ భవనాల వినియోగం పైన హైకోర్టు కీలక సూచనలు చేసింది. వైసీపీ హయాం లో నిర్మించిన ఈ భవనాల పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. భవనాలను సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం సహా పలువురు నేతలు పరిశీలన చేసారు. కీలక సూచనలు అందించారు. ఈ భవనాల వినియోగం పైన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సైతం హోటల్లు.. ఆతిథ్య రంగానికి చెందిన ప్రముఖ సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహించింది. కాగా, ఇప్పుడు హై కోర్టు ఈ భవనాల వినియోగం పైన కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, ఈ వ్యవహారంలో తదుపరి అడుగులపై స్పష్టమైన సూచనలు చేసింది. ఈ భవనాల వినియోగానికి సంబంధించి ఎలాంటి తుది నిర్ణయం తీసుకోరాదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కోర్టులో విచారణ వేళ
రుషికొండ భనవాలు సీఆర్‌జెడ్ (తీరప్రాంత నియంత్రణ మండలి) నిబంధనలను ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, ప్రస్తుతం కేవలం భవనాల వినియోగంపై 'ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్' ప్రక్రియ మాత్రమే నడుస్తోందని ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో, ప్రస్తుతానికి ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పర్యావరణాన్ని ధ్వంసం చేసి వీటిని నిర్మించారంటూ అప్పటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, వివాదాస్పదంగా మారిన ఈ రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించాలనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక తుది నిర్ణయం తీసుకోలేదు. కోర్టు తదుపరి విచారణలో ఈ అంశంపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications