అల్లు అర్జున్‌కు మెగా హీరో కౌంటర్.. ? ఎక్కడ నుంచి వచ్చామో మర్చిపోకు
గత కొద్దికాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని అనేక కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం అల్లు అర్జున్ అనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది.పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.
మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎన్నికల ఫలితాల సమయంలోనే హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ను బ్లాక్ చేశారనే ప్రచారం జరిగింది. దీనిపై ఇరువురు హీరోలు స్పందించలేదు. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మెగా హీరో వరుణ్ తేజ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'మట్కా' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు.

మా బాబాయ్, పెదనాన్నని ఎప్పుడూ మర్చిపోను. జీవితంలో నువ్వు ఎన్నో గొప్ప విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ, నువ్వు ఎక్కడ నుంచి వచ్చావన్నది మర్చిపోకూడదు. అది నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. చిరంజీవి గారు, బాబాయ్ ఎప్పుడూ నా మసన్సులో ఉంటారంటూ వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అయితే వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెగా అభిమానులు భావిస్తున్నారు. గతంలో మెగా ఫ్యామిలీ అండతో హీరోగా ఎదిగిన అల్లు అర్జున్, ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పని చేయడంతోనే వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు. దీనిపై అల్లు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications