అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మీనాక్షి చౌదరి?

తెలుగు, తమిళంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మీనాక్షి చౌదరి. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి, విశ్వక్ సేన్ తో హిట్, మహేష్ బాబుకు మరదలిగా గుంటూరు కారంలో నటించి పేరు తెచ్చుకుంది. తమిళంలో విజయ్ సరసన గోట్ సినిమాలో నటించింది. తాజాగా దుల్కర్ సల్మాన్ సరసన లక్కీభాస్కర్ లో నటించి మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మీనాక్షి ఖాతాలో మరో సినిమా ఉంది. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది.

షేక్ అవుతున్న సోషల్ మీడియా
తాజాగా మీనాక్షి చౌదరి త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతోందంటూ ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అక్కినేని హీరోను పెళ్లి చేసుకోబోతోందనేది ఈ వార్త సారాంశం. అతనెవరో కాదు.. కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్. అడ్డా, లవ్లీ, కరెంట్, కాళిదాసు లాంటి సినిమాల్లో నటించి సుశాంత్ ప్రేక్షకులను అలరించారుకానీ అవి అంతగా మెప్పించలేకపోయాయి. అల వైకుంఠపురంలో చేసిన పాత్ర మంచి పేరు తీసుకువచ్చింది. కొన్నాళ్ల నుంచి సుశాంత్, మీనాక్షి చౌదరి డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇందులో వాస్తవమెంతో తెలియదుకానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్త ట్రెండింగ్ లో ఉంది.

heroine Meenakshi Chaudhary is going to marry hero Sushant

అక్కినేని ఇంట్లో అన్నీ ప్రేమ పెళ్లిళ్లే
అక్కినేని ఇంట్లో అన్నీ ప్రేమ పెళ్లిళ్లే జరుగుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మాత్రం పెద్దలు కుదిర్చిన సాంప్రదాయం ప్రకారం అన్నపూర్ణను వివాహమాడారు. తర్వాత తరంలో ఆయన తనయుడు నాగార్జునకు, రామానాయుడి కుమార్తె లక్ష్మికి పెళ్లి జరిగినా వారిద్దరూ విడిపోయారు. తర్వాత నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున-లక్ష్మి తనయుడే నాగచైతన్య. నాగార్జున-అమల తనయుడు అఖిల్. తర్వాత నాగార్జున మేనల్లు సుమంత్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకొని కాపురం చేసిన కొంతకాలం తర్వాత విడాకులు తీసుకున్నారు. మేనకోడలు సుప్రియ కూడా విడాకులు తీసుకుంది. త్వరలోనే నాగచైతన్య శోభితను పెళ్లిచేసుకోబోతున్నారు. సుశాంత్ అక్కినేని నాగేశ్వరరావుకు మనవడు, నాగార్జునకు మేనల్లుడు అవుతారు. సుశాంత్ తల్లిదండ్రులు అనుమోలు సత్యభూషణరావు, నాగసుశీల.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+