సాయిపల్లవికి బాగా ఇష్టమైన తెలుగు సూపర్‌స్టార్
సహజమైన అందంతో అలరారే సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. కథ నచ్చితేనే, అందులోను తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటుంది. లేదంటే ఖరాఖండిగా సినిమా చేయను అని చెప్పేస్తుంది. అటువైపు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమా అన్నా, ఇటువైపు మహేష్ బాబు సినిమా అన్నా తన పాత్రకు ప్రాధాన్యత మాత్రమే చూసుకుంటుంది. అందుకే ఇప్పుడు హీరోయిన్లలో ఎవరికీ లేని ఎనలేని ప్రాధాన్యత సాయిపల్లవికి దక్కుతోంది. అందుకు కారణం ఆమె వైఖరి, ఆమె నటన, ఆమె వ్యక్తిత్వం. తన వ్యక్తిత్వంతోనే ఎంతోమంది అభిమానులను దక్షిణ భారతదేశంలో సంపాదించుకుంది.
ఆయనంటే తనకు ఎందుకు ఇష్టమంటే
తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తుంది. తాజాగా విడుదలైన అమరన్ లోకానీ, తండేల్ లోకానీ ఆమె అభినయానికి ఫిదా అవని అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి సాయిపల్లవికి తెలుగులో ఒక ఇష్టమైన హీరో ఉన్నారు. ఆయన ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని సాయిపల్లవి తండేల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు చెప్పింది. ఆయనంటే తనకు ఎందుకు ఇష్టమో కారణం కూడా చెప్పింది. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఎటువంటి ఇగో లేదని, ఎంతో నిరాడంబరంగా ఉంటారంది. అందరితో కలిసిపోతూ, అందరి కష్టాలు తీరుస్తూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం పవన్ కల్యాణ్‌దంటూ కొనియాడింది. పవన్ కల్యాణ్ వైఖరి అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయనకు డైహార్డ్ అభిమానిగా మారానని చెప్పింది.

మొదటి సినిమా అవుతుందనే అంచనాలున్నాయి
తండేల్ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.42 కోట్లు వసూలు చేసింది. అక్కినేని నాగచైతన్యకు తొలిసారిగా రూ.100 కోట్ల సినిమా అవుతుందన అంచనాలున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానరుపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందరినీ అలరించడంతోపాట పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. దేశభక్తి, ప్రేమకథ కలిపి సినిమాగా తీర్చిదిద్దారు. నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి చేసే సినిమా ఏదనేది ఇంకా తెలియరాలేదు. హిందీలో మాత్రం రణబీర్ కపూర్ తో రామాయణం చేస్తోంది. ఇందులో సీత పాత్రలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications