పిలిచి అవకాశమిచ్చినా రాజమౌళికి నో చెప్పిన హీరోయిన్

బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొని భారీ అడ్వెంచర్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తోంది. మహేష్ బాబుతో తీయబోయే సినిమా బిగ్ అడ్వెంచర్ గా సాగనున్నట్లు చెబుతున్నారుకానీ దీనిపై అధికారికంగా వార్తలైతే రాలేదు. రాజమౌళి సినిమాలో నటించాలని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హీరోలు, హీరోయిన్లు ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు.

మొహమాటం లేకుండా తిరస్కరించింది
వారికి ఒక్క అవకాశం వచ్చినా చాలంటున్నారు. అంతేకాదు.. మరికొందరైతే చిన్న చిన్న పాత్రల్లోనైనా చేస్తామని సంసిద్ధత తెలుపుతున్నారు. అంతగా వారు రాజమౌళి అవకాశం ఇస్తారేమోననే ఆశతో ఎదురుచూస్తున్నారు. అటువంటి రాజమౌళి పిలిచి మరీ తన సినిమాలో హీరోయిన్ గా నటించమంటే ఆ హీరోయిన్ మొహమాటం లేకుండా తిరస్కరించింది. దీంతో షాక్ తినడం రాజమౌళి వంతైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. క్యూట్ బ్యూటీ త్రిష.

heroine trisha did not accept director rajamouli offer

సంకోచించిన త్రిష
రాజమౌళి పిలిచి మరీ ఆఫర్ ఇస్తే ఈ చెన్నై చిన్నది సింపుల్ గా నో చెప్పేసింది. కొన్నాళ్ల క్రితం కమెడియన్ సునీల్ హీరోగా దర్శక ధీరుడు మర్యాద రామన్న అనే సినిమా తీశారు. ఇది ఎంతో సంచలనాన్ని సృష్టించింది. అందులో హీరోయిన్ గా త్రిషను తీసుకోవాలని రాజమౌళి భావించారు. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కమెడియన్ సునీల్ పక్కన అనేసరికి ఆమె కాస్తంత సంకోచించింది. రాజమౌళి లాంటి స్టార్ దర్శకుడు అయినప్పటికీ సునీల్ పక్కన నటించడం బాగోదు అనే ఉద్దేశంతో ఆ ఆఫర్ ను తిరస్కరించింది.

గుణపాఠం నేర్చుకున్న రాజమౌళి
దీంతో రాజమౌళి కూడా ఈ సంఘటన నుంచి ఓ గుణపాఠం నేర్చుకున్నారు. స్టార్ హీరోయిన్లు కాకుండా కొత్త హీరోయిన్లు అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో వారికోసం అన్వేషించి చివరకు సలోనిని ఎంపిక చేశారు. మర్యాద రామన్న సినిమా సలోనికి మంచిపేరు తీసుకువచ్చింది. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా త్రిష ఈ సినిమా చేసివుంటే ఆమెకు మంచిపేరు వచ్చివుండేదని, సునీల్ తో సమానంగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలా అయ్యేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+