సినిమా నచ్చకపోతే అమీర్‌పేట్‌ లో గుండు కొట్టించుకుంటా.. హీరోయిన్ సంచలనం..!

టాలీవుడ్‌ లో ఇప్పటివరకూ చాలా ప్రేమ కథలే వచ్చాయి. కొన్ని అలరించాయి. మరికొన్ని నిరాశపరిచాయి. చాలా తక్కువ సినిమాలు మాత్రమే కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ ట్రెండ్ మరోసారి మొదలైంది. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ, దీవానా, చెన్నై లవ్ స్టోరీ తదితర సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే ఇప్పుడు ఈ లిస్టులో చేరేందుకు మరో సరికొత్త ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే సహ (లైఫ్‌ ఆఫ్‌ సంజు) అనే మూవీ. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి నిశాంత్‌ దోటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ సెప్టెంబర్‌ 4న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ మేరకు తాజాగా ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్​ సినిమాలోని నటీనటులతోపాటు ప్రొడ్యూసర్ బన్నివాసు తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. సహ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. " ఈ మూవీ విషయంలో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు.. ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ సినిమా చూశాక మీరందరూ ఒక గొప్ప సినిమా చూశాం.. అనే సంతృప్తితోనే బయటికి వస్తారు తప్ప నిరాశతో రారు. ఒకవేళ ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను అమీర్‌ పేట్ సెంటర్‌ లో నిలబడి గుండు కొట్టించుకుంటా.. అంటూ హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Heroine viral If the movie isn t liked I ll get my head shaved in Ameerpet Heroine s challenge

అలాగే ఈ మూవీలో నటించిన హీరో శివ కుమార్ మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే నా నంబ‌ర్‌కి చేసి తిట్టండంటూ ఎమోషనల్ అయ్యాడు. అంతేగాక పబ్లిక్ గానే తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ క్రమంలో హీరో, హీరోయిన్లు సినిమాపై ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో వీరిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కథలో దమ్ము ఉంటే ఆటోమెటిక్ గా సినిమా హిట్ అవుతుందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కామెంట్స్ పెడుతున్నారు. ఇదంతా సినిమాకు పబ్లిసిటీ స్టంట్ అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఈ మూవీ సెప్టెంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+