మహేష్ బాబు దెబ్బకు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. ఇదే సమయంలో మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లు సైతం స్టార్‌లుగా ఎదిగారు.మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్లు చాలామంది సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఎంతో మంది హీరోయిన్లకు మంచి లైఫ్ ను ఇచ్చారు మహేష్ బాబు.

పోకిరి'తో ఇలియానా, 'దూకుడు'తో సమంత, 'ఒక్కడు'తో భూమిక, 'అతడు'తో త్రిష వంటి హీరోయిన్లు టాప్ స్థానానికి చేరుకున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం మహేష్ బాబుతో సినిమా చేసి ఏకంగా ఇండస్ట్రీలో కనిపించకుండాపోయారనే విషయం చాలామందికి తెలియదు. పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబు వరుస ఫ్లాపులను ఫేస్ చేశారు. పోకిరి తర్వాత సైనికుడు, అతిథి, ఖలేజా వంటి సినిమాలు ఫ్లాప్‌లు నిలిచాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అతిథి సినిమాలో హీరోయిన్‌గా అతిథి రావు నటించారు.

heroine who faded out in the industry after doing a movie with Mahesh Babu

అప్పటికే దేశ ముదురు సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్‌లో ఉన్న హన్సికను కాదని , అతిథి రావును అతిథి సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. అతిథి రావు తీసుకోవడం వెనుక మహేష్ భార్య నమ్రత పాత్ర కూడా ఉంది. అతిథి రావు,నమ్రత స్నేహితులు కావడంతో ఆమెను మహేష్ బాబు సినిమాలో ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. బాలీవుడ్‌లో ఒకటి, రెండు సినిమాలు చేసిన ఈ భామ తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయింది. ప్రస్తుతం ఓ ఫేమస్ ఆర్‌జేను వివాహం చేసుకుని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తోంది ఈ బ్యూటీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+