నితీష్ కుమార్ రెడ్డి కొంపముంచిన గాయం
ప్రతిష్ఠాత్మక ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు భారత క్రికెట్ జట్టుకు సన్నద్ధమైన వేళ.. గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు అధికారికంగా దూరం అయ్యాడు. తొడ కండరాల (క్వాడ్రిసెప్స్) గాయం తీవ్రం కావడంతో ఈ పర్యటనకు దూరం కావాల్సొచ్చింది. ఐర్లాండ్ మ్యాచ్‌లే కాకుండా, ఆ తర్వాత జరిగే ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అందుబాటులో ఉండే అవకాశం చాలా తక్కువే.
ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో ముగిసిన వన్డే సిరీస్ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో మొదటి వన్డేలో నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసి రాణించిన ఈ తెలుగు తేజం.. మూడో మ్యాచ్‌లో ఆరు ఓవర్లు వేసి వికెట్లేమీ సాధించలేకపోయాడు. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే అతనికి క్వాడ్రిసెప్స్ సమస్య తలెత్తింది. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో నితీష్ ఎడమ తొడ కండరాల్లో వాపు రావడమే కాకుండా ఫైబర్ దెబ్బతిన్నట్లు బులిటెన్ లో వెల్లడైంది.

దీంతో రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు రిపోర్ట్ చేయాలని సెలెక్టర్లు సూచించారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ తో మూడో వన్డేలోనూ నితీష్ ఆడలేదు. తాజాగా ఐర్లాండ్ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ ఆరంభం అయ్యే నాటికి కోలుకునే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో అందులో ఆడేది కూడా అనుమానమే.
నితీష్ కుమార్ రెడ్డి గాయం భారత జట్టు సమతూకాన్ని దెబ్బతీసేలా ఉంది. ఇప్పటికే ఆల్ రౌండర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్ ను వైదొలిగాడు. ప్రస్తుతం తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ సందర్భంగా హార్దిక్ గాయపడ్డాడు. వన్డేలలో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేసే పరిస్థితిలో కూడా అతను లేడు. హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డిని ఆ లోటును తీరుస్తాడని భావించినప్పటికీ.. అతను కూడా గాయపడటంతో తుదిజట్టు ఎంపిక సవాల్‌గా మారింది.
సూర్యాంశ్ శెడ్గేకు అవకాశం?
నితీష్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. సెలెక్టర్లు ఒకవేళ ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయాలనుకుంటే యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్ శెడ్గేను జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇండియా-ఏ తరఫున ఆడిన సూర్యాంశ్, శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయిదు మ్యాచ్‌లలో అతను 147 పరుగులు చేశాడు. 36.75 సగటును నమోదు చేశాడు. బౌలింగ్‌లో అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. అయిదు మ్యాచ్‌లలో రెండు వికెట్లే తీశాడు.
ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ












Click it and Unblock the Notifications