పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల ఎప్పుడూపై పరొక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటుంది.
ఇటీవల కాలంలో పూనమ్ కౌర్ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా నిలుస్తోంది. జగన్ తీసుకుంటున్న సంస్కరణలకు మద్దతుగా ఆమె ట్వీట్లు చేసింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడు పవన్‌పై విమర్శలు చేసే పూనమ్ కౌర్ ఈసారి ఆసక్తికరంగా ఓ వైసీపీ నేతను టార్గెట్ చేశారు. చింత ప్రభాకర్ రెడ్డి అనే ఓ వైసీపీ నేత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు టీడీపీ,జనసేన పార్టీలపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ వైసీపీకి మద్దతుగా నిలుస్తుంటారు.

చింత ప్రభాకర్ రెడ్డి తాజాగా ఏపీలో టెస్లా కంపెనీ పెట్టుబడుల గురించి వచ్చిన ఓ వార్తను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ట్వీట్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించింది. చింత ప్రభాకర్ రెడ్డి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. టెస్లాకు మూడు పెళ్లిళ్లు అయిన ఫర్యాలేదంటూ వైసీపీ నేతకు కౌంటరిచ్చింది. ఎప్పుడు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే పూనమ్ కౌర్ .. ఇలా పవన్ మూడు పెళ్లిళ్లను సమర్థిస్తూ..వైసీపీ నేతకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయంశంగా మారింది.
He is married three times - will that not be a problem ? https://t.co/JokclEHSK3
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 12, 2024












Click it and Unblock the Notifications