విడాకుల బాటలో మరో స్టార్ కపూల్ ..అలాంటి వ్యక్తి అనుకోలేదంటూ
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీ టీవీ నటి మహి విజ్, ఆమె భర్త జై భానుశాలీ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై స్పందించారు. "మా వ్యక్తిగత విషయాలు మీకెందుకు? ఒకవేళ విడాకుల లాంటివి ఉన్నా మీకు ఎందుకు చెప్పాలి? మీరు ఏమైనా నా అంకుల్ అవుతారా? లేక చెప్తే లాయర్ ఫీజు ఏమైనా కడతారా?" అని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమ గురించి, తమ భర్త గురించి పిచ్చి రాతలు రాయొద్దని, ఎవరో ఒకరి తప్పుందని రాయడం మీడియాకు అలవాటైపోయిందని ఆమె మండిపడింది. "మీరు చక్కగా బతుకుతూ మమ్మల్ని బతకనిస్తే బాగుంటుంది" అని సూచించింది. అదే ఇంటర్వ్యూలో తాను ఎప్పుడూ ఒక నటుడిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని కూడా పేర్కొంది. జై భానుశాలీ మొదట యాంకర్‌గా ఉండి ఆ తర్వాత నటుడిగా మారాడు.
మహి విజ్ వ్యాఖ్యలతో విడాకుల వదంతులు మరింత బలపడ్డాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఈ మధ్య విడాకులు తీసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు. ముగ్గురు పిల్లలు చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై మానసిక ఒత్తిడితో జీవితాంతం బతుకుతారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications