వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్ - పార్టీ నేతల ఆందోళన..!!
వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసారు. శనివారం రాత్రి చిప్పగిరి మండలం కన్వీనర్ పురుషోత్తంపై దాడి చేసి, కారు ఇంట్లోని వస్తువులను ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులు ధ్వంసం చేశాడు.
ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ కు నిరసన పార్టీ కేడర్ ఆందోళనకు దిగింది.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి.. ఆయన తనయుడు చంద్రను పోలీసులు అర్ద్రరాత్రి అరెస్ట్ చేసారు. ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, అడ్డుకోబోయిన మహిళపై చేయిచేసుకుని ఆమె దుస్తులు చించివేసిన తీవ్రమైన నేరపూరిత ఘటనలోనే చట్టప్రకారం పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అర్ద్రరాత్రి సమయంలో ఎమ్మెల్యే ఇంటి తలుపులు బద్దలు కొట్టి పాశవికంగా పోలీసులు అరెస్ట్ చేసారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

వైసీపీ కేడర్ ఆందోళన
ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదన భిన్నంగా ఉంది. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయకుండా.. పరామర్శకు వెళ్లిన ప్రజా ప్రతినిధి పైన కేసు పెట్టటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యేతో పాటుగా కుమారుడిని చిప్పగిరి స్టేషన్ కు తీసుకెళ్లటం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే నివాసంలోని హార్డ్ డిస్క్ లను పోలీసులు తీసుకెళ్లటం పైనా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ టీవీ కెమేరా ల్లోని ఫుటేజ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.













Click it and Unblock the Notifications