గుండె ధైర్యం ఉంటేనే ఈ థ్రిల్లర్ సినిమా చూడండి.. రూ.7కోట్లకు రూ.4వేల కోట్లు వచ్చాయి

కోట్ల బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, అగ్ర నటుల కాల్షీట్లు... ఇవేవీ లేకపోయినా ఓ సినిమా ప్రపంచాన్నే తనవైపు తిప్పుకోగలదా? 'ఖచ్చితంగా సాధ్యమే' అని నిరూపించింది 'అబ్సెషన్' అనే సైకలాజికల్ హారర్ త్రిల్లర్. ఏదో సరదాగా చూద్దాంలే అని థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులను ఈ సినిమా ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేసింది. కేవలం రూ. 7 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా రూ. 4,249 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

Watch this thriller movie only if you have the guts it grossed 4 000 crore against a budget of 7 crore
థియేటర్లలో రూ. 3వేల కోట్లు కొళ్లగొట్టి ఇప్పడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఇందులోనే..!
థియేటర్లలో రూ. 3వేల కోట్లు కొళ్లగొట్టి ఇప్పడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఇందులోనే..!

కథేంటి? అసలు అంతగా ఏముంది ఇందులో?

పియెర్ అనే ఒక సాధారణ ఒంటరి యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఒకరోజు అతనికి అనుకోకుండా ఒక రహస్యమైన, విచిత్రమైన వస్తువు లభిస్తుంది. తాను కోరుకున్నది ఏదైనా సరే నెరవేర్చే శక్తి దానికి ఉందనే నిజం పియెర్‌కు తెలుస్తుంది. తన చిన్ననాటి స్నేహితురాలు 'నిక్కీ' తనను పిచ్చిగా ప్రేమించాలని ఆ వస్తువుని కోరుకుంటాడు పియెర్. అనుకున్నట్లే నిక్కీ అతడితో ప్రేమలోపడుతుంది. అంతా ఒక కలలా, ఎంతో మధురంగా సాగిపోతుంటుంది. అక్కడే అసలు నరకం మొదలవుతుంది. ఆ ప్రేమ నెమ్మదిగా ఒక భయంకరమైన మానసిక రోగంగా మారిపోతుంది.

హైదరాబాద్ లో చిన్న సినిమా ప్రభంజనం.. 'పెద్ది' ని దాటేసిన కలెక్షన్స్..!
హైదరాబాద్ లో చిన్న సినిమా ప్రభంజనం.. 'పెద్ది' ని దాటేసిన కలెక్షన్స్..!

సైకోలా నిక్కీ

పియెర్‌ను క్షణం కూడా వదలకుండా నిక్కీ సైకోలా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. అతడి స్వేచ్ఛను పూర్తిగా హరించేసి, జీవితంలో ప్రతి చిన్న నిర్ణయాన్నీ తనే నియంత్రించడం మొదలుపెడుతుంది. తాను ఎంతగానో ఆశపడి కోరుకున్న ప్రేమే, తన జీవితాన్ని నరక ప్రాయంగా మార్చిందని గ్రహించేసరికి పియెర్ జీవితం చేజారిపోతుంది. హారర్ అంటే ఏదో దయ్యాలు, రక్తపాతాలు అని అనుకుంటే పొరపాటే! మానవ సంబంధాలు, స్వార్థం, నియంత్రించలేని కోరికలు ఎంత భయంకరమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయో ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. "తర్వాతి క్షణంలో ఏం జరగబోతోంది?" అనే తీవ్రమైన సస్పెన్స్ మిమ్మల్ని చివరి సెకను వరకు వెంటాడుతూనే ఉంటుంది.

సినిమా బడ్జెట్ కాదు, గ్రిప్పింగ్ కథే ఏ సినిమానైనా గెలిపిస్తుందని నిరూపించిన ఈ మైండ్-బెండింగ్ థ్రిల్లర్ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+