ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'హృదయం మురళి'
ఇటీవలికాలంలో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. రిలీజ్ కు ముందు భారీ హైప్ ఇచ్చి ఆ తర్వాత ఊసూరుమనిపిస్తున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అవుతున్నాయి. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. చిన్న సినిమాలదే ఇప్పుడు ట్రెండ్ కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని లాభాలను పొందుతున్నాయి.
అదే కోవకు చెందినదే హృదయం 'మురళి మూవీ'.. ఈ మూవీలో కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ తోపాటు ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ కథానాయికలుగా నటించారు. అలాగే ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. తమిళంలో ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యూత్ ను విశేషంగా ఈ చిత్రం ఆకట్టుకుంది.
అటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన ఈ మూవీకి వస్తోంది. యువ హీరో అథర్వకు చాలా కాలంగా హిట్ లేదు. కానీ ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ కొట్టినట్లుగానే భావించవచ్చు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 10 న ఈ మూవీ తెలుగులోనూ రిలీజ్ అయింది. తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే విజయవంతంగా థియేట్రికల్ రన్ ను ముగించుకున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఓటీటీలో ఈ మూవీ కేవలం తమిళంలోనే కాకుండా లేక తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications