సెంట్రల్ జైల్లో భార్య, కొడుకును పట్టుకుని గుక్కపట్టి ఏడ్చిన స్టార్ హీరో, ఆరోజు?

బెంగళూరులో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్, పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నాడు. సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న హీరో దర్శన్ ను చూడటానికి ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్, హీరో బెస్ట్ ఫ్రెండ్, కన్నడ హీరో వినోద్ ప్రభాకర్‌ (కన్నడ ప్రభాకర్ కుమారుడు) వెళ్లారు.

భార్య, కుమారుడి పరామర్శలో దర్శన్ కంటతడి పెట్టారు. కొడుకు వినేష్, విజయలక్ష్మి లోపలికి వెళ్లగా దర్శన్ భావోద్వేగానికి గురై కొడుకును కౌగిలించుకుని కాసేపు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు వినీష్‌ని కౌగిలించుకుని ఏడుస్తూ మాట్లాడాడని తెలిసింది. అరగంట పాటు జరిగిన ములాఖత్ లో హీరో దర్శన్ భావోద్వేగంతో మాట్లాడాడని, భార్య విజయలక్ష్మి కంటే కొడుకుతోనే ఎక్కువ సమయం గడిపాడని కన్నడ మీడియా తెలిపింది.

His wife Vijayalakshmi and son who met hero Darshan in Bangalore Central Jail

హీరో దర్శన్‌తో భేటీ అనంతరం నటుడు వినోద్‌ ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆ బాధను తట్టుకునే శక్తి అతని కుటుంబానికి కలగాలి. రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలి. దర్శన్‌ని కలుసుకుని నాలుగు నెలు అయ్యింది, అతని పుట్టినరోజు సందర్భంగా నేను అతన్ని కలిశాను. మీడియాలో ఈ వార్త చూసిన తర్వాత విషయం తెలిసింది. నేను దర్శన్ ను కలవడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి ప్రయత్నించానని, కానీ అక్కడ అతనిని కలవలేకపోయానని హీరో వినోద్ ప్రభాకర్ చెప్పారు.

ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లి దర్శన్ ను కలిసి మాట్లాడానని, దర్శన్ మౌనంగా ఉన్నాడని, తనను చూసి ఏం టైగర్ అని అన్నాడని, నాతో కొంతసేపు మాట్లాడాడని వినోద్ ప్రభాకర్ అన్నారు. ఈ కేసు గురించి నాకు మీడియాలో మాత్రమే తెలుసని అన్నారు. హీరో దర్శన్ గురించి వినోద్‌ ప్రభాకర్‌ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ చేయలేదని, బయటకూడా మాట్లాడలేదని ప్రతిచోటా మాట్లాడుకుంటున్నారని, తాను మాట్లాడినంత మాత్రానా సమస్య పరిష్కాం అవుతందా అని వినోద్ ప్రభాకర్ అన్నారు.

His wife Vijayalakshmi and son who met hero Darshan in Bangalore Central Jail

ఈ కేసు చాలా తీవ్రమైనది. కేసు పోలీసుల విచారణలో ఉందని, ఏం మాట్లాడాలో నాకు క్లారిటీ లేదని, తనను కలిసిన వారికి కూడా ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని చెప్పానని, చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని, అందరికీ న్యాయం జరగాలని, నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉందని,

దర్శన్‌ని తాను కలుసుకుని నాలుగు నెలు అయిపోయిందని, నేను నా పనిలో, సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నానని, ఈ కేసు గురించి మీడియాలో చూసిన తర్వాత తనకు తెలిసిందని, ఆ వార్త చూసి షాక్ అయ్యానని హీరో వినోద్ ప్రభాకర్ అన్నారు

దర్శన్ కుటుంబంతో పాటు అభిమానులు కూడా బాధలో ఉన్నారని, వారిని ఎలా ఓదార్చాలో నాకు తెలియలేదని, కేసు విచారణ జరుగుతున్నందున తాను ఎక్కువ మాట్లాడలేనని, దర్శన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నాడని, నేను అతన్ని ఒకసారి చూడటానికి వెళ్ళానని, నిర్దోషికి శిక్ష పడకూడదని చట్టంలో ఉందని, అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నానని హీరో వినోద్ ప్రభాకర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+