ఫస్ట్ లవ్ ని మర్చిపోను అంటున్న సమంత.. మొత్తానికి ఓపెన్ అయ్యిందిగా !
కుందనపు బొమ్మ "సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అక్కినేని నాగ చైతన్య సరసన "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా.. హిందీలో, హాలీవుడ్ లో పలు సినిమాలు, సిరీస్ ల లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ తన ఫస్ట్ లవ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరూ ఆమె నాగచైతన్య గురించి ఇన్నాళ్ళకు ఓపెన్ అయ్యింది అనుకుంటూ తెగ సెర్చ్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కంటే కూడా పర్సనల్ లైఫ్ విషయాలతోనే సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఆమె కారణంగానే విడాకులు జరిగాయి అంటూ పలు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె అనారోగ్యం కారణంగా సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వడం.. తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇక రీసెంట్ గానే నాగ చైతన్య మళ్లీ వివాహం చేసుకోవడం.. ఇప్పుడు ఫస్ట్ లవ్ అంటూ సామ్ కామెంట్స్ చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇంతకీ సామ్ ఏం చెప్పిందంటే..
నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ సినిమాలే.. ఇప్పటి నుండి నేను సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు. మళ్లీ సినిమాల్లో వరుసగా నటిస్తాను. ఇప్పటికే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇకపై వెయిట్ చేయించలేను అంటూ చెప్పింది. దీంతో సమంత మళ్లీ వరుస సినిమాలతో రాబోతుంది అంటూ అభిమానులు సైతం ఫుల్ ఖుషీ అవుతున్నారు.
డేటింగ్ లో సమంత..
ఇక సమంత పర్సనల్ లైఫ్ కి విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో సమంత డేటింగ్ లో ఉందని భావిస్తున్నారు.
ఇక ప్రస్తుతం సమంత వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో 'రక్త్ బ్రహ్మండ్' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రముఖ దర్శకులు రాజ్-డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అలాగే తెలుగులో తన సొంత బ్యానర్ లో "మా ఇంటి బంగారం" అనే సినిమాలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications