ప్రధాని మోదీ బయోపిక్ నేను చేయను.. బాహుబలి నటుడు!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత ప్రసిద్ధిచెందిందో అందరికీ తెలిసిందే. ఇక, ఈ సినిమాలో నటించిన స్టార్స్ందరీకీ మంచి పేరొచ్చింది. అయితే, ఇందులో కట్టప్ప పాత్ర ఎంతో కీలకం. ఒకానొక సమయంలో సినిమా మీద ఆసక్తిని పెంచింది ఈ పాత్రే. ఆ పాత్రలో నటుడు సత్యరాజ్ ఎంతో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పుకోవాలి. పలు సినిమాల్లో తండ్రి పాత్రలు చేశాడు సత్యరాజ్.
అయితే, తాజాగా ఈయనకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.అదేంటంటే ప్రధాని మోదీ బయోపిక్ లో సత్యరాజ్ నటించనున్నారనే వార్త ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే, ఈ వార్తపై నటుడు సత్యరాజ్ స్పందించారు. మోదీ జీవిత కథా ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో సత్యరాజ్ నటిస్తున్నారనే వార్తలను ఆయన ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మోదీ బయోపిక్‌లో అస్సలు నేను నటించను అని ఆయన ఖరాకండీగా చెప్పారు.

ఈ మధ్యకాలంలో బయోపిక్‌లు ఎక్కువయ్యాయి. చాలామంది ప్రముఖుల జీవిత కథలు తెరపైకి సినిమాలు వచ్చిన సంగతి మనకి తెలిసిందే. ఇక, తాజాగా ఆ జాబితాలోకి ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు కూడా చేరింది. త్వరలోనే ప్రధాని మోడీ జీవిత కథా ఆధారంగా విశ్వనేత పేరుతో సినిమా రానుందట. అయితే, ఈ సినిమాలో బాహుబలి ఫేమ్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రచేయనున్నారని టాక్ వచ్చింది. దీనిపై నటుడు సత్యరాజ్ స్పందించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మోడీ బయోపిక్ గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ బయోపిక్‌లో నేను నటించనున్నాను అంటు వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదు. అసలు బయోపిక్ ప్రాజెక్టు గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఈ న్యూస్ చూసిన వెంటనే ముందుగా నేను షాక్‌కు గురయ్యా. ఇలాంటి తప్పుడు న్యూస్‌ను ప్రచారం చేయకండి. ఒకవేళ భవిష్యత్తులో నరేంద్రమోదీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదిస్తే ఆ ప్రాజెక్టు నేను చేయను అని చెబుతా.. ఎందుకంటే, అది నా సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకమని ప్రధాని బయోపిక్‌పై నటుడు క్లారిటి ఇచ్చాడు. ప్రస్తుతం సత్యరాజ్ చేసిన ఈ కామెంట్లు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications