అసలు ఈ ఫోటోలో ఎక్కడైనా "గొడుగు" కనిపించిందా..?
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వినోదానికే కాదు, మన పరిశీలనా శక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును పరీక్షించే ఆసక్తికరమైన బ్రెయిన్ టీజర్లుగా ఇవి మారాయి. ఒక సాధారణ చిత్రంలో దాగి ఉన్న వస్తువును గుర్తించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, మన కళ్లకు కనిపించే దృశ్యాన్ని మెదడు కొన్ని సందర్భాల్లో భిన్నంగా అర్థం చేసుకుంటుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను 'దృశ్య భ్రమలు' అని పిలుస్తారు.
ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న ఓ కొత్త ఇల్యూషన్ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఒక కాఫీ షాప్ సీన్ కనిపిస్తుంది. అక్కడ కస్టమర్లు కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఒక వెయిట్రెస్ టేబుల్ దగ్గర కాఫీ సర్వ్ చేస్తోంది. కౌంటర్ వద్ద ఒక వెయిటర్ పని చేస్తుండగా, మరో వ్యక్తి బార్ స్టూల్స్ దగ్గర కూర్చుని కనిపిస్తున్నాడు. మొదట చూస్తే ఇది ఒక సాధారణ కేఫే దృశ్యంలానే అనిపిస్తుంది.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ చిత్రంలో ఒక గొడుగు చాలా తెలివిగా దాగి ఉంది. దానిని కేవలం కొద్ది సెకన్లలో గుర్తించడం చాలామందికి కష్టంగా మారుతోంది. వేలాది మంది ఈ ఛాలెంజ్‌ను ప్రయత్నించినా, వెంటనే సమాధానం కనిపెట్టలేక తలలు పట్టుకుంటున్నారు. "గద్ద కళ్ళు" ఉన్నవారే ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలరని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ మన మెదడు పరిశీలనా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. రంగులు, ఆకారాలు, లైటింగ్, షేడ్స్ వంటి అంశాలు కలిసిపోయినప్పుడు మన మెదడు అసలు దృశ్యాన్ని వెంటనే గుర్తించలేకపోతుంది. అందుకే దాగి ఉన్న వస్తువులను గుర్తించడం ఒక మానసిక వ్యాయామంలా పనిచేస్తుంది.
అధ్యయనాల ప్రకారం, తరచూ ఇలాంటి బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ ప్రయత్నించే వారి ఏకాగ్రత, మెమరీ పవర్, సమస్య పరిష్కార నైపుణ్యాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా పిల్లలు, యువత ఇలాంటి పజిల్స్ ఆడటం వల్ల ఆలోచనా వేగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరల్ కాఫీ షాప్ ఇల్యూషన్ కూడా అదే కోవకు చెందింది. చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మాత్రమే గొడుగు కనిపిస్తుంది. చాలా మంది తొలిచూపులో మిస్ అవుతున్న ఈ చిన్న క్లూ, వారి పరిశీలనా నైపుణ్యాలకు నిజమైన పరీక్షగా మారింది. మరి మీరు ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో దాగి ఉన్న గొడుగును గుర్తించగలిగారా?












Click it and Unblock the Notifications