చీటింగ్ కేసులో బాలీవుడ్ నటికి మధ్యంతర బెయిల్...
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌కు తాజాగా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూర్ చేసింది. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో 30 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకూ మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ సీల్దా కోర్టు తీర్పునిచ్చింది. ఎలాంటి అనుమతి లేకుండా జరీన్‌ఖాన్ విదేశాలకు వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
జరీన్‌ఖాన్‌పై 2018 చీటింగ్ కేసు నమోదైంది. కోల్‌కత్తాలోని దుర్గాపూజకు సంబందించిన ఈవెంట్‌కు హాజరయ్యేందుకు జరీన్‌ఖాన్ రూ.12 లక్షలు అడ్వాన్సుగా తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈవెంట్‌కు హాజరు కాలేకపోయారు. ఈ విషయంపై ఈవెంట్ నిర్వాహకులు ఆమెపై మండిపడ్డారు. అంతేకాకుండా, ఆ కార్యక్రమానికి రాకపోవడంతో జరీన్‌తోపాటు ఆమె మేనేజరుపై నార్కెల్‌దంగ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసును పెట్టారు. ఈ విషయం పై వివరణ కూడా ఇవ్వాలంటూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో కోర్టుకు జరీన్ హాజరు కాలేదు. దాంతో ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్‌లో జరీన్ ఖాన్‌కు న్యాయస్థానం అరెస్ట్ వారెంట్‌ను కూడా జారీ చేసింది.

రూ. 30 వేల పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు : అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆమె హాజరయ్యారు. తన ఆధార్ కార్డును కూడా సమర్పించారు. ఆమె చెప్పిన సమాధానాలు కోర్టు అంగీకరించకపోవడంతో ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇప్పుడు కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసులో 30వేల రూపాయలకు వ్యక్తిగత పూచీకత్తుతో ఈ నెల 26 వరకు బెయిల్ మంజూరు చేసింది.. అలాగే ఆమెను అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లోద్దని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రతి విచారణకు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని కూడా స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications