ఓటీటీలోకి ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో తేదీ ఖరారు

మాస్ మహారాజా రవితేజ తాజా సంచలనం 'ఇరుముడి' థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే అద్భుతమైన టాక్‌తో విశేష ప్రజాదరణ పొందుతోంది. ఎలాంటి టికెట్ల ధరల పెంపు లేకుండానే సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటూ, ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

థియేటర్లలో భారీ విజయం

థియేటర్లలో గ్రాండ్ సక్సెస్‌గా ప్రదర్శితమవుతున్న తరుణంలో, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) ఎంట్రీపై సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు 'ఇరుముడి' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల నిబంధన ప్రకారం, ఈ సినిమా సెప్టెంబర్ 18 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందనే వార్త ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. అయితే, ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చకు దారితీశాయి. థియేటర్లలో కలెక్షన్ల జోరు తగ్గకపోవడంతో ఓటీటీ విడుదలను మరికొన్ని రోజులు వాయిదా వేసే దిశగా నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వారు పేర్కొనడంతో స్ట్రీమింగ్ ఆలస్యమవుతుందేమోనని అభిమానులు భావించారు.

భారతదేశ సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్
భారతదేశ సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్
Irumudi Mass Maharaj Ravi Teja Block Buster Movie Heads to ott Netflix release date confirmed

ఈనెల 18 నుంచే

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఒప్పందం ప్రకారమే సెప్టెంబర్ 18 నుంచే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఏకకాలంలో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. దీనిపై మరింత స్పష్టత రావాలంటే నెట్‌ఫ్లిక్స్ లేదా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సినీ విశ్లేషకులు మాత్రం ఈ సినిమాను మరికొద్దిరోజులు థియేటర్లలోనే ఆడించాలని, ఆ తర్వాతే ఓటీటీకివ్వాలని సూచిస్తున్నారు. దీనివల్ల థియేటర్లు బాగుంటాయని, వాటిపై ఆధారపడినవారు బాగుంటారని, అందుకే సినిమా ప్రారంభంలోనే ఒప్పందాలు కుదుర్చుకోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలు లేని రోజుల్లో సినిమాలను ఆదుకుంది థియేటర్లే అన్న విషయాన్ని కూడా మర్చిపోవద్దని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+