ఓటీటీలోకి రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఇరుముడి' థియేటర్ల వద్ద సంచలన వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ మూవీ రిలీజ్ 17 రోజులు కావొస్తున్నా ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తోంది. ఆగస్టు 21 న రిలీజ్ అయిన ఈ మూవీ రోజురోజుకూ బీభత్సమైన టాక్ తో రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే కరోనా మహమ్మారి తర్వాత టాలీవుడ్ లో అత్యధిక మంది చూసిన సినిమానూ 'ఇరుముడి' నిలిచింది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇందులో రవితేజ కు జోడీగా ప్రియా భవానీ శంకర్‌ నటించగా, ఆయన కూతురిగా బేబీ నక్షత్ర అలరించింది. వీరితోపాటు సాయికుమార్‌, అజయ్‌ ఘోష్‌, రమేష్‌ ఇందిరా, కొమురం, లక్ష్మణ్‌ వంటి వారు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూ. 40 కోట్లతో తెరకెక్కించింది. అయితే ఇప్పటివరకూ ఈ మూవీకి రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కాయి. రానున్న రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని కొల్లగొడుతుందో చూడాలి.

ఇరుముడి మూవీ అయ్యప్ప భక్తుల కథ, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌ తో పాటు కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా శివ నిర్వాణ అద్భుతంగా రాసుకున్నారు. సీలేరు అనే ఏజెన్సీ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి కొద్ది దూరంలో ఉన్న పొల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను బేస్‌ చేసుకొని ఈ కథను రూపొందించారు. ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అలా మౌత్ టాక్ తోనే ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇరుముడి రిలీజ్ అయి ఇప్పటికి 17 రోజులు పూర్తయినా మూడో ఆదివారం ఈ సినిమాకు అత్యధిక కలెక్షన్లు రావడం విశేషం. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు, బయ్యర్లకు దాదాపు రూ.90 కోట్ల వరకు లాభాలు రావడం విశేషం.

Irumudi movie by hero Ravi Teja OTT release date confirmed Streaming on Netflix from September 18

అయితే ఇరుముడి మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇరుముడి మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ లేదా నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీని ఇప్పటికే దాదాపు కోటి మందికి పైగా థియేటర్లలో చూసినట్లు సమాచారం. ఇంకా ఎవరైనా చూడాల్సి ఉంటే ఓటీటీలో చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+