దీపికా పదుకొనే సినిమాలకు బ్రేక్?

దీపికా పదుకొనే.. భారతీయ నటిగా, నిర్మాతగా, భారతదేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటీమణులలో ఒకరిగా దీపికా పదుకొనే కు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలోనూ బ్రాండ్ వ్యాల్యూలోనూ దేశంలోనే ఆరో స్థానంలో దీపికా పదుకొనే ఉన్నారు. బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ లోనూ నటించిన దీపికా పదుకొనే 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

దీపికా పదుకొనే రికార్డు
ఇక తాజాగా కల్కి సినిమాతో అరుదైన రికార్డులను సృష్టించిన దీపికా పదుకొనే కల్కి సినిమాతో రెండవసారి 1000 కోట్ల క్లబ్లో చేరారు. అంతకుముందు షారుక్ ఖాన్ తో నటించిన పఠాన్ సినిమాతో దీపికా పదుకొనే 1000 కోట్ల క్లబ్ లో చేరగా, రెండవసారి మళ్లీ కల్కి సినిమాతో దీపికా పదుకొనే ఈ రికార్డును సృష్టించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసిందే.

Is Deepika Padukone going to take a break from movies

కీలక నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొనే
ప్రెగ్నెంట్ గా ఉన్న దీపికా పదుకొనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఇక తాజాగా తనకి పుట్టబోయే బిడ్డ విషయంలో దీపికా పదుకొనే కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 38 సంవత్సరాల లేటు వయసులో బిడ్డకు తల్లవుతున్న దీపికా పదుకొనే తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎక్కువ సమయం బేబీతోనే గడపాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

పుట్టబోయే బిడ్డ కోసం దీపికా నిర్ణయం
ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు సరోగసి ద్వారా బిడ్డలను కనకుండానే తల్లులవుతున్నారు. ఇంకా కొంతమంది సెలబ్రెటీలు బిజీ షెడ్యూల్లో పిల్లలను కేర్ టేకర్స్ కు అప్పగిస్తున్నారు. అయితే దీపికా పదుకొనే మాత్రం తాను అలా చేయనని, తన బిడ్డ అలనా పాలన మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్టు సమాచారం.

సినిమాలకు బ్రేక్ ఇస్తారా ?
అలాగే తన భర్త రణవీర్ సింగ్ కూడా బిడ్డ ఆడనా పాలన చూసుకోవడంలో భాగస్వామ్యం అయ్యేలా చేయాలని దీపికా పదుకొనే భావిస్తున్నట్టుగా సమాచారం. పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోనే పెరగాలని భావిస్తున్న దీపిక అలా పెరిగినప్పుడే వారిలో ప్రేమానురాగాలు కలుగుతాయన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే దీపికా పదుకొనే ఎక్కువ సమయం బేబీతోనే గడపాలని నిర్ణయం తీసుకోవడంతో సినిమాలకు ఆమె ఏమైనా బ్రేక్ ఇస్తారా అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+