ఒకప్పుడు రోజా కాళ్లు మొక్కినోళ్లే వీళ్లంతా..జబర్దస్త్ నటుడు సంచలన కామెంట్స్..!
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎం బాధ్యతలు తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్నారు. 20119లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్, ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పవన్ కల్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కృషి చేసిందనే చెప్పాలి. ప్రముఖ యాక్టర్లందరూ కూడా పవన్ విజయాన్ని కోరుకున్నారు. ఇక జబర్దస్త్ ఆర్టిస్టులందరూ పవన్ విజయం కోసం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, జనసేన పార్టీ తరపున ప్రచారం చేశారు. వీరంతా కూడా మాజీ మంత్రి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. కానీ ఒక్క రాకింగ్ రాకేష్ మాత్రమే రోజాకు మద్దతుగా నిలిచారు. అయితే రాకింగ్ రాకేష్ వైసీపీకి సపోర్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు రాకేష్‌ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడంతో పాటు నీకు ఇండస్ట్రీలో ఆఫర్లు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

అయితే పవన్ ఫ్యాన్స్ వార్నింగ్ కు భయపడిన రాకేష్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేయడం జరిగింది. తాజాగా దీనిపై రాకింగ్ రాకేష్ స్పందించారు. రోజా మీద అభిమానంతోనే తాను ఆమెకు మద్దతుగా నిలిచానని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు. ఆమె మీద అభిమానంతో నగరి వెళ్ళి ప్రచారం చేశానని..నాది ఉడతా భక్తి లాంటిదని ఆయన తెలిపారు. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలిచారని.. నాతో పాటు చాలా మంది ఆమె సహాయం పొందారు. నా చేతుల ద్వారా కూడా ఎంత మందికి ఆమె మేలు చేశారో నాకు తెలుసునని రాకేష్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆమె కాళ్లు మొక్కిన వారు కూడా ఇప్పుడు విమర్శించే స్థాయికి ఎదిగారని..అది వారి వ్యక్తిత్వానికే వదిలేద్దమంటూ రాకేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications