కాబోయే అత్త మామలతో కలిసి అల్లుడు శుభ్‌మన్ గిల్- రాయల్ లుక్

భారత జట్టు టెస్ట్- వన్డే ఫార్మట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. మరోసారి వార్తల్లోకెక్కాడు. టీమిండియా లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్, ఆయన భార్య అంజలితో కలిసి కనిపించాడు. శుక్రవారం లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రోకెట్ క్లబ్‌ సెంటర్ కోర్టులో ఈ ముగ్గురూ మెరిశారు. వింబుల్డన్ సెంటర్ కోర్ట్ రాయల్ బాక్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వింబుల్డన్ సింగిల్స్ సెమీఫైనల్స్‌ను వీక్షించడానికి ఈ ముగ్గురూ లండన్ కు వచ్చారు.

టెన్నిస్ క్లబ్ వారిద్దరికీ ఘనస్వాగతం పలికింది. రాయల్ బాక్స్‌లో అంజలి, సచిన్ టెండూల్కర్‌లతో కలిసి కూర్చున్న ఫోటోను గిల్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. నెటిజన్లలో హాట్ టాపిక్ కు దారి తీసింది. సచిన్ టెండూల్కర్- అంజలి దంపతుల కుమార్తె సారా టెండుల్కర్ తో శుభ్ మన్ గిల్ చాలాకాలంగా డేటింగ్ లో ఉంటోన్నాడనే వార్తలు దీనికి ప్రధాన కారణం. ఈ వార్లను గిల్.. మరోసారి నిజమని రుజువు చేసినట్టయిందీ పిక్ తో.

Sachin Tendulkar Arrived Royal Box at the Centre Court at Wimbledon With Anjali and Shubman Gill

సచిన్ టెండూల్కర్ రాక పట్ల అటు వింబుల్డన్ క్లబ్ కూడా హర్షం వ్యక్తం చేసింది. ఆయనకు ఘన స్వాగతం పలికింది. రాయల్ బాక్స్ లో సచిన్ ఆసీనుడై ఉన్న ఫొటోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేసింది. క్రికెట్ రాకుమారుడు రాయల్ బాక్స్‌కు తిరిగి వచ్చాడని సంతోషాన్ని వ్యక్తం చేసింది. "వెల్ కమ్ బ్యాక్ టు వింబుల్డన్.. సచిన్ టెండూల్కర్" అనే క్యాప్షన్ ను దానికి జత చేసింది.

మట్టికరిచిన దిగ్గజం.. బెల్జియం: ఫిఫా నుంచి అవుట్: మునిగిందక్కడే
మట్టికరిచిన దిగ్గజం.. బెల్జియం: ఫిఫా నుంచి అవుట్: మునిగిందక్కడే

టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత రాయల్ బాక్స్ నుండి వింబుల్డన్ వీక్షించడానికి ఆహ్వానం అందుకున్న నాలుగో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్. గతంలో శిఖర్ ధావన్, దీప్తి శర్మ కూడా వింబుల్డన్ గ్రాస్ కోర్టులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ఆహ్వానించిన ప్రత్యేక అతిథుల్లో వెస్టిండీస్‌ మాజీ స్టార్ బ్రియాన్ లారా కూడా ఉన్నారు.

కాగా.. వింబుల్డన్ రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో నోవాక్ జొకోవిచ్‌ ఓడిపోయాడు. జానిక్ సినర్ చేతిలో పరాజయాన్ని చవి చూశాడు. ఫైనల్స్ లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సిద్ధమయ్యాడు. కాగా.. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. ఆ దేశ జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ను ఆడనున్నాడు గిల్. మొదటి మ్యాచ్ ఈ నెల 14వ తేదీన ప్రారంభం కానుంది. 16, 19 తేదీల్లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ ఆడే జట్టులో గిల్ కు చోటు దక్కలేదు. నూతన సారథి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. కష్టాలను ఎదుర్కొంటోంది. ఐర్లాండ్‌ చేతిలో 2-0 తేడాతో అనూహ్యంగా సిరీస్ ఓటమిని చవిచూసిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 3-0 తేడాతో వెనుకంజలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+