రూ.6 టికెట్ బ్లాక్ లో రూ.210..చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమా.. ఈ వారమే రీ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల తార శ్రీదేవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. తాజాగా ఈ సినిమా విడుదలై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది. మే 09న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇక సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో లొకేషన్స, విజువల్స్ మరింత కొత్తగా ఈతరం ప్రేక్షకులకు చూపించేందుకు చిత్ర నిర్మాణ సంస్థ ఏకంగా రూ. 8 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాను 3డీ, 8కే వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ పాత సినిమాను 8కే వెర్షన్ లో రిలీజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరో 4 రోజుల్లో అంటే మే 9వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. సరిగ్గా 35 ఏళ్లకు మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చేస్తోంది. అప్పట్లో 1990 మే 9న ఈ మూవీ విడుదలైంది. ఇక ఈ మూవీ రిలీజ్ సమయానికి చిరంజీవికి ఎంత క్రేజ్ ఉందో చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ పోస్టు ద్వారా వెల్లడించింది. అదేంటి అంటే.. ఈ సినిమా రూ.6 టికెట్ రూ.210కు బ్లాక్‌లో అమ్ముడై నట్లు వైజయంతి మూవీస్ సంస్థ పేర్కొంది. ఏకంగా 35 రెట్ల అధిక ధరకు బ్లాక్‍లో టికెట్ టికెట్లు పలికినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలోని దినక్కుతా సాంగ్ షూటింగ్ సమయంలో చిరంజివి 108 డిగ్రీల జ్వరంతో ఉన్నాడట. అయినా కూడా డ్యాన్స్ ఇరగదీసినట్లు నిర్మాత అశ్వినీదత్ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం రిలీజ్ సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ లో తుపాను ఉందట. అయినా కూడా మెగాస్టార్ క్రేజ్ కారణంగా జనాలు తండోపతండాలుగా మూవీకి వచ్చినట్లు నిర్మాత అశ్వినీదత్ తెలిపారు.












Click it and Unblock the Notifications