ఎన్టీఆర్ దేవరలో జగన్ డైలాగ్.. ''కులం చూడం , మతం చూడం''
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న చిత్రం 'దేవర'ట్రైలర్ తాజాగా విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయిందనే చెప్పాలి. ఎన్టీఆర్ తనదైనశైలి డైలాగులతో అదరగొట్టారు. ట్రైలర్‌ను చూస్తుంటే సముద్రం చూట్టు జరిగే కథ అని అర్థం అవుతోంది. తండ్రి , కోడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు.ఇక ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. కథలో ఆయన నిడివి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది. ఇక ట్రైలర్‌లో జాన్వీ కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునే ఉంది. అయితే ఈ దేవర సినిమాలో వైసీపీ అధినేత వాడిన డైలాగ్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్‌లో స్టార్టింగ్‌లో ప్రకాష్ రాజ్ బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇస్తూ.. ''కులం లేదు, మతం లేదు, భయం లేదంటూ'' ఓ డైలాగ్ చెబుతారు. అయితే ఇది వైసీపీ అధినేత జగన్ నుంచి అనుకరించారనే మాటలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో జగన్ .. కులం చూడం,మతం చూడం, ప్రాంతం చూడమంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ డైలాగునే దేవర సినిమాలో వాడినట్టు కనిపిస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్ జగన్ డైలాగ్‌ను స్టేజీ మీద చెప్పడం జరిగింది.

గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే కార్యకర్తలు తలెత్తుకుని కాలర్ ఎగరేసేలా ఉండాలని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన ఎన్టీఆర్..దేవర గురించి చెబుతూ..దేవర అనే చిత్రం లేట్ అయినా కూడా అభిమానులు కాలర్ ఎగిరేసేలానే ఉంటుందని ఆయన తెలిపారు.దీంతో ఎన్టీఆర్ కావాలని చెబుతున్నారో లేదా యాదృశ్చికంగా చెప్పారో తెలియదు కానీ.. మాజీ సీఎం జగన్ చెప్పిన డైలాగులు ఎన్టీఆర్ నోటి నుంచి రావడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే సినీ , రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications