నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు: వైఫ్ గురించి ఓపెన్ అయిన జగపతిబాబు
టాలీవుడ్ లో జగపతిబాబు చేయని రోల్ లేదని చెప్పాలి.. ఫ్యామిలీ హీరోగా, హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ప్రతి పాత్రకు ప్రాణం పోస్తూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు జగపతి బాబు. కెరీర్ బిగినింగ్ లో గాయం, శుభలగ్నం, మావిచిగురు, శుభాకాంక్షలు లాంటి ఫ్యామిలీ చిత్రాలతో అలరించారు. ఆ తర్వాత బాలయ్య లెజెండ్ చిత్రంతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
లెజెండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో విలన్ గా మెప్పించారు. ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో అప్పలసూరి పాత్రకు ప్రాణం పోశారు. పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మూవీకి టర్నింగ్ పాయింట్ గా జగపతిబాబు పాత్ర ఉంటుంది. ముసలి వయసు వ్యక్తిగా అప్పలసూరి పాత్రలో జగపతిబాబు హావభావాలు కంటనీరు తెప్పిస్తాయి. అంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ద్వారానే అందరూ ఆయన్ను ప్రేమతో జగ్గూభాయ్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతుంది. రెండో వారం కలెక్షన్లు భారీగా తగ్గాయి. బ్రేక్ ఈవెన్ కు వెళ్తుందా..? అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
అయితే జగపతిబాబు సాధారణంగా తన ఫ్యామిలీ విషయాలను ఎప్పుడూ బయట చెప్పలేదు.. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వైఫ్, ఫ్యామిలీ గురించి ఓపెన్ అయ్యారు. ఈ మేరకు తన లైఫ్ లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి ఆయన వెల్లడించారు. తన భార్య లక్ష్మి బాధపడిన సందర్భం గురించి ప్రస్తావించారు. అయితే లెజెండ్ చిత్రం సమయంలో జగపతిబాబు తన ఇంటిని అమ్మేశారు. అప్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇంటిని ఖాళీ చేసే సమయంలో జగపతిబాబు ఇంట్లో లేరట.. షూటింగ్ లో ఉన్నారట.. తన భార్య, పిల్లలు మాత్రమే వెకేట్ చేశారట. ఆ విషయాల్ని గుర్తు చేసుకున్నారు జగపతిబాబు. ఆ సమయంలో తాను పక్కన లేకపోవడంతో తాను బాధపడిందని చెప్పుకొచ్చారు.

అలాగే తన భార్య, పిల్లలు ఎప్పుడూ మీడియా ముందుకు రాలేదని.. బయటకు ఎక్స్ పోజ్ అవ్వడానికి వారు ఇష్టపడరని జగపతిబాబు తెలిపారు. అందుకే మేం ఎప్పుడైనా బయటకు వెళ్తే, షాపింగ్ కు మాల్ వంటి వాటికి వెళ్తే.. ఎప్పుడూ నా వెంట నడవదు.. ముందు అయినా వెళ్లిపోతారు. ఆ తర్వాత వెనకాల అయినా వస్తారు.. గానీ నాతో మాత్రం కలిసి నడవరు. వాళ్లు సినిమాకి పూర్తి దూరంగా ఉండాలనుకుంటారు అని జగపతిబాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications