Jailer 2 Overseas Review: రజనీకాంత్ 'జైలర్ 2' ఓవర్సీస్ రివ్యూ ఇదే..
సూపర్ స్టార్ రజనీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో 2023 లో వచ్చిన 'జైలర్' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పటి ట్రేడ్ పండితులు అందించిన వివరాల ప్రకారం జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.604.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో ఇండియా గ్రాస్ సుమారు రూ.408.5 కోట్లు కాగా.. ఓవర్సీస్ నుంచి దాదాపు రూ.196 కోట్లు రాబట్టింది. తమిళ సినిమాల్లో రూ.500 కోట్ల మార్క్ దాటిన అతికొద్ది సినిమాల్లో 'జైలర్' కూడా చేరి అందరినీ ఆశ్చర్య పరిచింది.
దాంతో జైలర్ 2 సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల రిలీజ్ అయిన జైలర్ 2 మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దాంతో తమిళ ఇండస్ట్రీకి ఎప్పటినుంచో కలగా మారిన రూ. 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఈ మూవీతో తీరనున్నట్లు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక జైలర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15 న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఇక జైలర్ 2 రిలీజ్ కు ఇంకా 3 రోజులే సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. విదేశాల్లో అడ్వాన్స్ సేల్స్ దాదాపు ఇప్పటి వరకు 2 మిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. ఇండియాలో తొలి రోజు షోల కోసం రూ.3.53 కోట్లకు పైగా టికెట్లు ముందుగానే అమ్ముడైనట్లు తెలుస్తోంది.
ఇక జైలర్ 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ ను అందించింది సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డ్ ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ సుమారు 2 గంటల 45 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసి నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజనీకాంత్ మాస్ ఎలివేషన్స్ పై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం అందుతోంది. అలాగే ఇప్పుడు జైలర్ 2 మూవీ ఓవర్సీస్ రివ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ ప్రివ్యూ షో రీసెంట్ గా లండన్ లో ప్రదర్శించారట.

అక్కడినుంచి వస్తున్న టాక్ ప్రకారం జైలర్ 2 ఫస్టాఫ్ నెల్సన్ దిలీప్ కుమార్ మార్కు ఎలివేషన్స్ తో రజనీకాంత్ ను వేరే లెవెల్ లో చూపించారని సమాచారం. అలాగే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇంటర్వెల్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్ లో రెండు అద్భుతమైన ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్ లో హృతిక్ రోషన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయని టాక్ వస్తోంది. మొత్తానికి సినిమా సూపర్ హిట్ అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఫుల్ రివ్యూ తెలియాలంటే అక్టోబర్ 15 వరకు ఆగాల్సిందే..












Click it and Unblock the Notifications
