ఆ ఇద్దరు హీరోలు వేస్ట్.. జూ ఎన్టీఆర్ బెస్ట్.. జాన్వీ కపూర్!!

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో భారతదేశంలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే దేశం మొత్తం ఒక్కసారిగా తెలుగు హీరోల వంక చూస్తుంది. తమ డాన్స్ తో అదరగొట్టే సూపర్ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప విషయం. టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురు డ్యాన్స్ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుంటారు.

బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే
ఒకప్పుడు తెలుగు సినిమాలలో డ్యాన్సుల విషయంలో మెగాస్టార్ చిరంజీవి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకోగా, ఇప్పుడు చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో గొప్పగా డ్యాన్స్ చేసే సూపర్ హీరోలుగా రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ నిలిచారు. అయితే వీరిలో కూడా బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే అందరి నోటి నుంచి ఒకే పేరు వినిపిస్తుంది. అందుకు కారణం కూడా ఉంది.

Janhvi Kapoor inner feeling on Jr NTR she loves to dance with tarak

డ్యాన్స్ లో తారక్ సో స్పెషల్ .. ఎందుకంటే
రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ఏదైనా డ్యాన్స్ చేయాలంటే ఆ స్టెప్పులను ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ లోనే అప్పటికప్పుడు స్టెప్పులు వేసి జనాలను మెస్మరైజ్ చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయించడం చాలామంది కొరియోగ్రాఫర్స్ కూడా ఇష్టపడతారు. తారక్ ఎంత కష్టమైనా స్టెప్ నైనా ఎక్కువ ప్రాక్టీస్ లేకుండానే సునాయాసంగా చేసేస్తాడు.

దేవర కొరియోగ్రాఫర్ బాస్కో ఏమన్నారంటే
ఇక ఇదే విషయాన్ని దేవర సినిమాలో కొరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో చెప్పాడు. తెలుగులో గతంలో శ్రీమంతుడు, ధృవ వంటి సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన బాస్కో ఎన్టీఆర్ డ్యాన్స్ పైన ప్రశంసలు గుప్పించారు. చాలా కష్టమైన స్టెప్పుల్ని కూడా ఎన్టీఆర్ చాలా ఈజీగా చేసేస్తాడని దేవర సినిమాలో ఆయన డ్యాన్స్ అదిరిపోతుందంటూ ప్రశంసల జల్లు కురిపించాడు.

జూనియర్ ఎన్టీఆర్ తోనే ఇష్టం: జాన్వీ కపూర్
ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యాన్స్ పైన హీరోయిన్ జాన్వి కపూర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ వీరిలో ఎవరితో మీరు డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతారు అని అడిగితే జూనియర్ ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతానని జాన్వి కపూర్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వీ డ్యాన్సుల జాతర
జాన్వి కపూర్ కూడా డ్యాన్స్ లో అనేక మెళకువలు నేర్చుకొని జనాలను మెస్మరైజ్ చేసేలా డ్యాన్స్ చేస్తుంది. అందుకే డ్యాన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడాలని ఈ ముద్దు గుమ్మ భావిస్తోంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి జాహ్నవి కపూర్ డ్యాన్సుల జాతర ఏ రేంజ్ లో ఉంటుందో అన్నది తాజాగా జాన్వి వ్యాఖ్యలతో చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+