అతను జైలుకు వెళ్లాల్సిందే.. జాన్వీ కపూర్ షాకింగ్ పోస్ట్ !
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక సీరియస్ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలచిత్కా పిల్లల ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్‌పై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం మరింత చర్చకు తెరలేపింది.
ఇన్ స్టా స్టోరీ..
ఈ మేరకు ఆ స్టోరీలో.. ఇలాంటి ప్రవర్తన అస్సలు క్షమించరానిది అంటూ రాసుకొచ్చారు. మానవత్వం లేకుండా చేసిన ఈ దుర్మార్గానికి కనీసం పశ్చాత్తాపం కూడా ఉండదా? ఇటువంటి వ్యక్తులను శిక్షించకపోతే అది మన సమాజానికి సిగ్గు చేటు. ఆ వ్యక్తి జైలుకు వెళ్లాలి అంటూ పోస్ట్ చేశారు.

అసలు ఏం జరిగింది అంటే..
ఠాణే జిల్లాలోని బాలచిత్కా క్లినిక్‌లో గోకుల్ ఝా అనే వ్యక్తి తన తల్లిని డాక్టర్‌కి చూపించేందుకు అక్కడకు వచ్చాడు. డాక్టర్ డ్యూటీలో లేకపోవడంతో, రిసెప్షనిస్ట్ సోనాలి కలసరే అతనిని వేచి ఉండమని సూచించింది. కాని క్యూ పద్ధతిని పాటించకుండా అతను డాక్టర్ క్యాబిన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిపై సోనాలి అడ్డుకోవడంతో, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత వచ్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో గోకుల్ ఝా కోపంతో సోనాలి కలసరేను జుట్టు పట్టుకొని లాగడం, నేలపై ఈడ్చడం, కాలితో తన్నడం వంటి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరో వీడియోలో సోనాలి ముందుగా గోకుల్ తల్లిపై చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది. దాంతోనే ఈ వివాదం మరింత ముదిరిందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని గోకుల్ ఝాను అరెస్ట్ చేశారు. తరువాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

జాన్వీ కపూర్ సినీ ప్రస్థానం..
జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.












Click it and Unblock the Notifications