జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో దాడి.. మళ్లీ తెరపైకి ట్రోలింగ్ వివాదం!

సోషల్ మీడియా వార్తలకు మాత్రమే కాకుండా ట్రోలింగ్, వివాదాస్పద కంటెంట్‌కు వేదికగా మారుతున్నాయి. చాలా కాలంగా పలువురు సినీ కథానాయకులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికల్లో నిరంతకం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరుగుతున్న దాడి.. ఆయనే లక్ష్యంగా, పక్కా ప్రణాళికతో జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు సంబంధించిన అసభ్యకరమైన, వికృతమైన స్టిక్కర్లు, మార్ఫింగ్ ఫోటోలు విస్తృతంగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లలో ఇటువంటి స్టిక్కర్లు వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్ దిశగా 'జైలర్2’
ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్ దిశగా 'జైలర్2’

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధి దాటి, ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడులో కూడా ఈ మార్ఫింగ్ ఫోటోలను కొందరు హాస్యాస్పదమైన పోస్టులుగా ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను విచిత్రమైన, అసభ్యకరమైన రీతిలో చూపిస్తున్న వేలాది పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఇది సాధారణ సరదా హద్దులు దాటి వ్యక్తిత్వ హననం స్థాయికి చేరుకుంది. నెటిజన్లు ఇలాంటి ట్రోల్స్‌కు అలవాటు పడితే అది ఆయన ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై ఎన్టీఆర్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.

Jr NTR Trolling Controversy Brutal Trolls and Morphed Stickers Target Actor Fans demand legal action

గతంలో 'చుట్టమల్లే' సాంగ్ ఆధారంగా తయారుచేసిన ఏఐ అసభ్యకర కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించినప్పటికీ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు. ఇప్పుడు దానికి తోడు వాట్సాప్ స్టిక్కర్లు, జిఫ్‌(GIFs) లు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.

మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద 'రణబాలి’ రికార్డుల మోత!
మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద 'రణబాలి’ రికార్డుల మోత!

ఇటీవలే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరు, ఫోటోలు, గుర్తింపును అపహాస్యం చేయకుండా నిరోధించడానికి ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టు నుంచి పర్సనాలిటీ రైట్స్ ఆజ్ఞలను పొందిన సంగతి తెలిసిందే. ఈ చట్టపరమైన ఉత్తర్వులను వినియోగించుకుని ఇలాంటి అసభ్యకర ట్రోలింగ్‌కు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+