విజయవాడలో దారుణం: నీళ్ల బాటిల్ కోసం 2 గంటలు హింసించి ప్రాణాలు తీశారు!

విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం నీళ్ల బాటిల్ దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశారు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది.ఈ ఘటన విజయవాడ పటమట డొంకరోడ్డు ప్రాంతంలో జరిగింది. మృతుడు మాస సాయికుమార్ . నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి, అతను కొంతకాలంగా భార్య, పిల్లలతో విజయవాడలో నివసిస్తున్నారు.

ఈ నెల 19న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో స్థానిక పాన్‌షాపు దగ్గరికి వెళ్లారు. తాళం వేసి ఉన్న ఫ్రిజ్ నుంచి నీళ్ల బాటిల్ తీసుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు అటుగా వచ్చిన పాలవ్యాన్ డ్రైవర్ దాన్ని గమనించి పాన్‌షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు.వెంటనే అక్కడికి వచ్చిన రవిశంకర్ సాయికుమార్‌ను మద్యం షాపు వెనకాలి సందులోకి ఈడ్చుకెళ్లారు. అక్కడ అయ్యప్ప అనే మరో వ్యక్తితో కలిసి సాయికుమార్ చేతులు వెనక్కి విరిచి విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు.

vijayawada crime Horrific incident Man tortured for 2 hours over a water bottle and killed by four people

ఈ సమయంలో పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా వారితో కలిసి దాడికి పాల్పడ్డారు. నలుగురూ కలిసి సుమారు రెండు గంటల పాటు దాడి చేశారు. భార్యా పిల్లలు ఉన్నారని, వదిలేయమని వేడుకున్నా వారు వినలేదు. కనికరం లేకుండా దాడి చేయడంతో సాయికుమార్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఉదయం అటుగా వచ్చిన వ్యక్తులు రక్తపు గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని గుర్తించారు. నలుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు.ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. కేవలం ఒక నీళ్ల బాటిల్ కోసం ఒక వ్యక్తిని ఇంత దారుణంగా చంపేయడం స్థానికంగా అందరినీ షాక్ కు గురి చేసింది.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!

చిన్న చిన్న విషయాలకు కూడా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడటం సమాజానికి హానికరంగా మారుతోంది. పోలీసులు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. నిందితులపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. మృతుడి కుటుంబం తీవ్ర మానసిక వేదనలో ఉంది. భార్యా పిల్లలు అనాథలైపోయారు.నగరాల్లో రాత్రి సమయాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిఘా పెంచాలని కోరుతున్నారు. చిన్న విషయాలకు కూడా హింసకు పాల్పడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ కేసు స్పష్టం చేస్తోంది. పోలీసుల దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+