రాజమౌళి-ఎన్టీఆర్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఇదే
దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశంతో ఉన్న రాజమౌళి అందుకు తగిన విధంగా దేశంలో తన సినిమాలతో పేరు తెచ్చుకొని ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయంగా రాజమౌళి కీర్తి ప్రతిష్టలను పెంచింది. తాజాగా మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇది రూపొందబోతోంది. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
రాజమౌళికి హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 తోపాటు సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేశారు. సింహాద్రి భారీ విజయం సాధించిన తర్వాత తారక్ తో మరోసినిమా చేయాలన్న ఉద్దేశంతో ఒక కథను సిద్ధం చేయించారు. ఆ కథకు అనుగుణంగా సినిమా తీయాలంటే బడ్జెట్ రూ.50 కోట్లు అవుతుంది.

అంత బడ్జెట్ తో సినిమా తీయగలమా? నిర్మాతలు ముందుకు వస్తారా? లేదంటే పెట్టిన ఖర్చును సినిమా రాబట్టగులుగుతందా? అనే సందేహాల్లో ఉండిపోయాడు. దీంతో ఆ కథ తెరకెక్కలేదు. ఆ సినిమాకు పేరు కూడా అనుకున్నారు గరుడ అని. షూటింగ్ ప్రారంభమవడమే తరువాయి అనుకున్న తరుణంలో ఎందుకనో అది వాయిదా పడిపోయింది.
ఈ సినిమాకు భారీస్థాయిలో గ్రాఫిక్స్ కూడా అవసరపడతాయి. కారణాలేమైనప్పటికీ సినిమా మాత్రం తెరకెక్కలేదు. తర్వాత మగధీరతోపాటు యమదొంగ సినిమాలో కూడా రాజమౌళి గ్రాఫిక్స్ వాడారు. అయితే తర్వాత కూడా గరుడ తెరకెక్కుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూశారుకానీ వారి ఆశలు అడియాసలయ్యారు. మహేష్ బాబు సినిమా తర్వాతైన దీన్ని అంతర్జాతీయస్థాయికి అనుగుణంగా సిద్ధంచేసి తీస్తారేమోనని రాజమౌళి అభిమానులు ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications