తెలుగులో ఏకైక నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ సంచలన రికార్డ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన 41వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అతి చిన్నవయసులోనే నటుడైన జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి సినిమాలతో స్టార్ డమ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. వార్2, డ్రాగన్ సినిమాల తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిన తారక్ రాజమౌళితో నాలుగు సినిమాలు చేయడం విశేషం. మహేష్ బాబు సినిమా చేసిన తర్వాత రాజమౌళి తారక్ తో మరో సినిమా చేసే అవకాశం ఉంది.
దుమ్ము దులపడం ఖాయమంటున్నారు
తెలుగు నుంచి జపాన్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడిగా తారక్ నిలిచారు. తమిళం నుంచి రజినీకాంత్ ఈ రికార్డు సాధించగా, తెలుగు నుంచి తారక్ మాత్రమే సాధించారు. ఆయన కటౌట్ కు మహిళా అభిమానులు జపాన్ లో పాలాభిషేకం చేయడం, హారతులివ్వడంలాంటివి చేస్తున్నారంటే అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సరైన సినిమా పడితే జపాన్ లోనే దుమ్ము దులపడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన నరసింహుడు సినిమాలో మొదటి భాగం చివరి వరకు ఆయన వాయిస్ వినపడదు. తెలుగులో ఈ తరహా ప్రయోగం ఎవరూ చేయలేదు.

ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటనకు, డైలాగ్ డెలివరీకి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా టీవీలో ప్రసారమైనప్పుడు 29.8 టీఆర్పీ రేటింగ్ సాధించి సంచలన రికార్డులు నెలకొల్పింది. ఇంతవరకు ఏ తెలుగు సినిమా ఇంత టీఆర్పీ రేటింగ్ సాధించలేదు. టెంపర్ సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారమైన 20కి తగ్గకుండా రేటింగ్ తెచ్చుకుంటుంది. ఎన్నో రికార్డులు నెలకొల్పిన తారక్ ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా డ్రాగన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై క్రేజ్ విపరీతంగా ఉంది. వాటిని అందుకుంటారో, లేదో చూడాలి.












Click it and Unblock the Notifications