అర్జెంటుగా గోవా బయలుదేరిన జూనియర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. తారక్ కొద్దిగా గ్యాప్ తీసుకొని దేవర షూటింగ్ ను మొదలుపెట్టారు. కొరటాల శివ ఆచార్య తర్వాత ఈ సినిమా చేస్తున్నారు. కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో కొరటాల ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన భారీ సెట్స్ తో, భారీ యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని కొరటాల ప్రకటించారు. హైదరాబాద్ లో స్పెషల్ సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేసింది దేవర మూవీ టీం. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ గోవాకి పయనమయ్యారు. ఆయన ఎందుకు గోవాకు వెళుతున్నారని చాలామంది ప్రశ్నలు సంధించారు. అయితే సినిమా షూటింగ్ కోసమే గోవా వెళుతున్నట్లు స్పష్టత వచ్చింది. గోవాలో హీరో హీరోయిన్లకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. తారక్, జాన్వీకపూర్ కలిసి వీటిల్లో నటించబోతున్నారు. దానికోసమే జూనియర్ గోవా వెళ్లారు.

దేవర మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలవుతుంది. తరువాత భాగం షూటింగ్ వెంటనే మొదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతోపాటు సమానంగా హృతిక్ రోషన్ వార్ 2 చిత్రంలో కూడా పనిచేయనున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాలోను ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత ఎవరి దర్శకత్వంలో చేయాలనేదానిపై చర్చలు జరిగాయని, కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications