ఆ సినిమా వదులకున్నందుకు ఇప్పటికీ ఎంతో బాధ: ఎన్టీఆర్
సినీ పరిశ్రమలో కథలను తయారుచేసే రచయితలు, దర్శకులు తమ దృష్టిలో ఒక హీరోను ఉంచుకుంటారు. ఆ హీరో బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా కథను తీర్చిదిద్దుతారు. తర్వాత సదరు హీరోను కలిసి కథను వినిపిస్తారు. అప్పటికే సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం, కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాలవల్ల ఆ సినిమా ఆ హీరో చేయలేడు. తర్వాత వేరే హీరో చేస్తాడు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇదంతా సినీ పరిశ్రమలో సహజంగా జరుగుతుంది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
'బొమ్మరిల్లు'లో అవి ఉండవు కాబట్టి చేయనన్నా
ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన దగ్గరకు వచ్చినవి, తాను తిరస్కరిస్తే బ్లాక్ బస్టర్ అయిన సినిమాల గురించి కూడా చెప్పారు. అందులో ప్రధానంగా రెండు సినిమాలను ప్రస్తావించారు. ఒకటి 'బొమ్మరిల్లు' కాగా, రెండోది 'భద్ర' సినిమా. బొమ్మరిల్లు సినిమా చేస్తే తన దగ్గర నుంచి మాస్ ఆడియెన్స్ ఫైట్లు, పాటల్లాంటివి ఆశిస్తారని, భారీ యాక్షన్ సన్నివేశాలుండాలని, అవేవీ ఉండవు కాబట్టి ఆ సినిమా తాను చేసివుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేదన్నారు. దర్శకుడు భాస్కర్ కథ చెప్పిన తర్వాత అందుకే తిరస్కరించినట్లు తారక్ వెల్లడించారు. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించారు. సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.

ఈరోజుకు కూడా బాధపడుతుంటా
ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మొదటి సినిమా 'భద్ర' కథ ముందుగా తనకే చెప్పాడని ఎన్టీఆర్ చెప్పారు. అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రవితేజ, మీరాజాస్మిన్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీన్ని కూడా దిల్ రాజు నిర్మించారు. ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డానని, ఇప్పటికీ 'భద్ర' సినిమా చేయనందుకు బాధపడుతుంటానని ఎన్టీఆర్ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తారక్ తర్వాత 'దమ్ము' అనే సినిమా చేశారుకానీ అది యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత బోయపాటితో సినిమా చేయలేదు. ప్రస్తుతం 'వార్2', 'డ్రాగన్' సినిమాలు చేస్తున్నాడు. దీనితర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications