రెస్టారెంట్ స్టైల్ 'మేథీ చమన్'.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు..!
మేథీ చమన్ తయారు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరదు. అందుకే చాలా మంది ఈ వంటకాన్ని రెస్టారెంట్ లోనే ఆస్వాదిస్తుంటారు. ఇంట్లో చేసుకోవడానికి వెనకాడుతుంటారు. అయితే ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'మేథీ చమన్' ను ఇలా తయారు చేసుకుంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. ఈ టేస్టీ కర్రీని ఒక్కసారి ఆస్వాదిస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. మరి ఈ టేస్టీ 'మేథీ చమన్' కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
మేథీ చమన్ తయారీకి కావాల్సిన పదార్థాలు పనీర్ రెండు కప్పులు, మెంతికూర ఒక కప్పు, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజులో, టమాటో ఒకటి పెద్దది, పచ్చిమిర్చి రెండు లేదా మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర అర టేబుల్ స్పూన్, కస్తూరి మేథి ఒకటి లేదా రెండు స్పూన్ లు, గరం మసాలా తగినంత, నీళ్లు తగినంత, నూనె మూడు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి.
ఇప్పుడు మేథీ చమన్ తయారీ విధానం చూస్తే ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత తరిగిన టమాటో ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, జీడిపప్పు పేస్ట్ వేసి నూనె తేలేంత వరకూ ఉడికించుకోవాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంలో తరిగిన మెంతికూర వేసి నూనె తేలేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పనీర్ ఘనాలను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పనీర్ తురుము వేసి కలపాలి. ఇప్పుడు కావాలిసిన చిక్కదనం మేరకు నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత క్రీమ్, కసూరి మేథీ, గరం మసాలా వేసి కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ మేథీ చమన్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications