కేబినెట్ ప్రక్షాళన లో కొత్త ఫార్ములా, వీరు అవుట్ - కొత్త గవర్నర్లుగా.. కీలక శాఖలు వీరికే..!!
కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ఎవరిని తప్పించాలి.. ఎవరికి అవకాశం ఇవ్వాలనే కసరత్తు దాదాపు పూర్తయింది. కొందరు సీనియర్లకు పార్టీ బాధ్యతలతో పాటు మరో ముగ్గురికి గవర్నర్లుగా అవకాశం దక్కనుంది. కీలక శాఖల నిర్వహణలోనూ మార్పు జరగటం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ - ప్రభుత్వంలో సమూల ప్రక్షాళనతో మోదీ 4.0 కి సిద్దం అవుతున్నారు. కేబినెట్ ప్రక్షాళన ముహూర్తం పైన దాదాపు స్పష్టత వచ్చింది.
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్త వారికి అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఉన్న వారిలో 17 మందిని తప్పించేందుకు రంగం సిద్దమైంది. మొదట బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్త జట్టును ప్రకటిస్తారని.. తదనుగుణంగా మోదీ క్యాబినెట్ మార్పులతో పునర్వ్యవస్థీకరణ ఉండనుంది. నితిన్ నబీన్ టీంను పార్టీ అగ్ర నేతలు ఖరారు చేశారని.. కీలక సంస్థాగత పదవుల్లో యువతకు పెద్దపీట వేయనున్నారు. నబీన్ గత వారం కొంతమంది కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపారు. వీరిలో కొందరిని పార్టీలోకి తీసుకోనున్నారు. పార్టీ ఆఫీసు బేరర్లలో కొందరిని క్యాబినెట్‌లోకి తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించటం ఖాయమని తెలుస్తోంది. పలువురు సీనియర్ల శాఖల్లో మార్పుచేర్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ప్రక్షాళన చేయనున్నారు. కాగా, కేంద్ర మంత్రులు పంకజ్ చౌధురి, హర్ష్ మల్హోత్రాకు ఇప్పటికే యూపీ, ఢిల్లీ పార్టీ పగ్గాలు అప్పగించారు. ఒకరికి ఒకే పదవి అన్న సూత్రం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణలో వీరికి ఉద్వాసన ఖాయంగా కనిపిస్తోంది.

పార్టీ - ప్రభుత్వంలో కీలక మార్పులు
ఇక, రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసినా.. కేంద్ర మంత్రు లు జార్జి కురియన్, రవనీత్‌సింగ్ బిట్టూలకు రెండోసారి అవకాశమివ్వలేదు. దీంతో కురియన్ రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ సీఎం సర్దార్ బియాంత్‌సింగ్ మనవడైన బిట్టూ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది యూపీ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ప్రాధాన్యత దక్కనుంది. టీఎంసీ, శివసేన(యూబీటీ) రెబెల్స్‌కు చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. కేంద్రమంత్రులు హర్‌దీప్ సింగ్ పురీ, బీఎల్ వర్మల రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది నవంబరులో ముగియనుంది. ఇక ముగ్గురు గవర్నర్లు థావర్‌చంద్ గహ్లోత్ (కర్ణాటక), మంగూభాయ్ పటేల్ (మధ్యప్రదేశ్) జూలైలో, లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్‌సింగ్ (ఉత్తరాఖండ్) సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. కొందరు ప్రస్తుత మంత్రులను గవర్నర్లుగా అవకాశం దక్కనుందని సమాచారం.













Click it and Unblock the Notifications