మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు.. శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయటం లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆధునిక రైస్ మిల్లులను త్వరలోనే కేటాయించనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
మహిళా స్వయం సహాయక సంఘాలకు రైస్ మిల్లులు
ఈ పథకానికి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానుంది. మంత్రి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇందిరమ్మ క్యాంటీన్ల వంటి వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు
రైతులు పండించిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేసి, వాటిని నాణ్యమైన బియ్యంగా ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ చర్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా, మధ్యవర్తుల వ్యవస్థను దూరం చేసి నేరుగా లాభాలు పొందేందుకు దోహదపడుతుందని అధికారులు అంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యం
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది మహిళలను ఐదేళ్లలో ఆర్థికంగా స్వావలంబన కల్పించి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమం మహిళలను కేవలం ఉపాధి దాతలుగా కాకుండా నిజమైన వ్యాపారవేత్తలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులను సమీక్షించారు.
మహిళలకు సంతోషం కలిగించే వార్త
రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లపై కూడా దృష్టి సారించారు. మరోవైపు మహిళలకు సంతోషం కలిగే వార్త చెప్పారు. గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, వారి సామాజిక-ఆర్థిక స్థితిని మార్చేలా తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి తన ప్రకటన ద్వారా స్పష్టం చేశారు..













Click it and Unblock the Notifications