ఉడిపిలో తల్లితో కలిసి ప్రత్యేక పూజలు చేసిన జూనియర్ ఎన్టీఆర్, అమ్మ కోరిక

పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉడిపిలోని శ్రీ కృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపురలోనే జన్మించారు.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి సొంత ఊరు కుందాపుర. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు నిలబడి తల్లితో కలసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు. సెప్టెంబర్ 2వ తేదీ తన తల్లి పుట్టిన రోజు అని, ఆమె పుట్టిన రోజుకి నేను ఇచ్చే మొదటి బహుమతి ఇదేనని జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

Junior NTR visited Sri Krishna temple in Udupi and did special pooja with his mother

మా అమ్మ తన సొంత ఊరు కుందాపురకు పిలుచుకుని వెళ్లాలని నాతో చాలాసార్లు చెబుతూ ఉన్నారని, ఇంతకాలానికి ఆమె కోరిక నెరవేరిందని జూనియర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదే సందర్బంలో హోంబాలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరందూర్ కు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. నా ప్రియమిత్రుడు ప్రశాంత్ నీల్ ( కేజిఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు) కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా తనతో కలిసి ఉడిపి గుడికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ మధుర క్షణాలను తన జీవితంలో మర్చిపోలేనని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

కేజీఎఫ్ సినిమా దక్షకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాంతార సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి చాలా సన్నిహితుడిగా మారిపోయారు. జూనియర్ ఎన్టీఆర్, కాంతార హీరో, ఆ సినిమా దర్శకుడు అయిన రిషబ్ శెట్టి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+