నాలుగో తరగతిలోనే ప్రెగ్నెన్సీ భయంతో వణికిపోయా: స్టార్ నటి
ప్రముఖ టీవీ నటి కనికా మాన్ తన చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. తాను కేవలం నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే సొంత కజిన్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుల కోసం వెళ్లినప్పుడు అతను తనను తప్పుడు ఉద్దేశంతో తాకాడని.. ఆ సమయంలో లైంగిక వేధింపుల గురించి సరైన అవగాహన లేకపోయానా.. ఏదో తప్పు జరుగుతోందన్న భయం మాత్రం తనను తీవ్రంగా కలచివేసిందని కనికా మాన్ పేర్కొన్నారు.
అమాయకత్వం, ప్రెగ్నెన్సీ భయం
కజిన్ చేసిన అసభ్య ప్రవర్తన వల్ల తాను ఎక్కడ ప్రెగ్నెంట్ అవుతానో అని కనిక అప్పట్లో తీవ్రంగా ఆందోళన చెందారట. పిల్లలు ఎలా పుడతారో తెలియని ఆ చిన్న వయసులో, ఇంట్లోని పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటల ఆధారంగా ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. బొప్పాయి పండ్లు ఎక్కువగా తింటే గర్భస్రావం (అబార్షన్) జరుగుతుందని విన్న ఆమె.. ప్రెగ్నెన్సీ రాకూడదనే భయంతో విపరీతంగా బొప్పాయి పండ్లు తినేవారట. తన అమాయకత్వం, అప్పుడు అనుభవించిన మానసిక క్షోభను వివరిస్తూ కనిక కన్నీటి పర్యంతమయ్యారు.

నిశ్శబ్దంగా దాచుకున్న బాధ
ఈ భయంకరమైన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడానికి ఆమెకు పదేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయంలో చెబితే తననే తప్పుబడతారేమో లేదా తన తల్లిదండ్రులు తిడతారేమో అన్న భయంతో ఆమె ఆ బాధను తనలోనే దిగమింగుకున్నట్లు ఆమె వెల్లడించింది. సమాజం, కుటుంబం తనను ఎలా చూస్తుందో అన్న ఆందోళనతో చాలా ఏళ్ల పాటు మౌనంగా ఉండిపోయిందట. కేవలం కొద్ది కాలం క్రితమే ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగలిగానని.. ఆ చేదు అనుభవం నుంచి కోలుకోవడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని ఆమె ఎమోషనల్ అయ్యింది.
కెరీర్ కోసం తండ్రిని ఎదిరించి..
కనికా మాన్ కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాకుండా వృత్తిపరంగా కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన కనిక గ్లామర్ రంగంలోకి రావడం ఆమె తండ్రికి అస్సలు ఇష్టం లేదు. అయినప్పటికీ తన నటనపై ఉన్న మక్కువతో ఆమె ఇంట్లో చెప్పకుండానే షూటింగ్స్‌కు వెళ్ళేవారు. ఆమె ఓ నటిగా స్థిరపడిన తర్వాతే తన తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసిందని కనిక వెల్లడించారు. ప్రస్తుతం ఆమె 'నాగిన్ 7' వంటి పాపులర్ షోలతో బుల్లితెరపై స్టార్‌గా రాణిస్తున్నారు.












Click it and Unblock the Notifications