22 ఏళ్లుగా టాప్ షోకి ఎండ్ కార్డ్... చివరి కాఫీ అంటూ స్టార్ సెలబ్రిటీ భావోద్వేగం..
భారతీయ ప్రేక్షకులను పలువురు స్టార్స్ సినిమాలతో పాటు బుల్లితెరపైనా అలరిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దశాబ్ధాలుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయనే కాదు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు టాప్ స్టార్స్ అందరికీ టీవీలో అనుబంధం ఉంది. భారత్‌లో కొన్ని షోలు ఐకానిక్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇలాంటి వాటిలోకే వస్తుంది కాఫీ విత్ కరణ్ టాక్ షో. సెలబ్రిటీ ఇంటర్వ్యూలలో ఈ షో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీనిని చూసి హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ టాక్ షోలు రూపుదిద్దుకున్నాయి. వాటికి స్టార్లే హోస్ట్‌లుగా వ్యవరించి సత్తా చాటారు.
1998లో కుచ్ కుచ్ హోతా హైతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు కరణ్. కబీ ఖుషి కబీ గమ్, కల్ హో నా హో, కాల్, కబీ అల్విద నా కెహ్నా అంటూ బాలీవుడ్‌పై తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ హిట్ చిత్రాలను అందించి పలువురు హీరో హీరోయిన్లను బాలీవుడ్‌కి పరిచయం చేశారు. 50 ఏళ్లు దాటినా ఇంకా ఈయన పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగానే ఉండిపోయారు. కరణ్ జోహార్ ఆస్తుల విలువ రూ.1800 కోట్ల పైమాటేనని బీటౌన్ వర్గాల మాటల. బాలీవుడ్‌లోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ధర్మా ప్రొడక్షన్స్ ద్వారా హిందీ డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని ఆయన శాసిస్తున్నారు. మన తెలుగు సినిమాలను హిందీలో కరణ్ జోహార్ పంపిణీ చేస్తూ టాలీవుడ్‌కు అండగా నిలుస్తున్నారు.

సినిమాలతో, ఇతర వ్యాపారాలతో బిజీగా ఉండే కరణ్ జోహార్ హోస్ట్‌గానూ సత్తా చాటారు. అదే కాఫీ విత్ కరణ్ టాక్ షో. సెలబ్రిటీలు ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం, అల్లరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. హిందీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు ఈ షోను ఆదరించారు. ఈ షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కరణ్ జోహార్. 2004 నవంబర్ 19న స్టార్ వరల్డ్‌లో ఈ కార్యక్రమం టెలికాస్ట్ అయ్యింది. నాటి నుంచి నిరాటంకంగా 22 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ టాక్ షో. ర్యాపిడ్ ఫైర్, ఓపీనియన్స్, కాఫీ క్విజ్ అంటూ సెలబ్రిటీలను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేసి వారి నుంచి సమాచారాన్ని రాబడుతుంటారు. ఇప్పటి వరకు 8 సీజన్లు, 161 ఎపిసోడ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఎన్నో వివాదాలకు, సంచలనాలకు ఈ షో కేరాఫ్‌గా నిలిచంది. అలాంటి ఈ ఐకానిక్ టాక్ షోకు ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎమోషనల్ వీడియో పెట్టారు.
2004లో ఈ సెలబ్రిటీ టాక్ షో గురించి మా నాన్నతో చర్చించా.. ఆయన చాలా కంగారుపడిపోయారు. దీని వల్ల నీకు ఆర్ధికంగా ఎలాంటి ప్రయోజనం రాదన్నారు. దురదృష్టవశాత్తూ ఆయన అదే నెలలో కన్నుమూశారు. అయితే కొన్ని ప్రయాణాలను ముగించాలని అనిపించదు.. కానీ వాటికి కూడా ఎండ్ కార్డ్ వేసే రోజు వస్తుంది. కాఫీ విత్ కరణ్ నా జీవితంలోనే కీలకమైనది.. ఎన్నో జ్ఞాపకాలను నాకు అందించింది. కాఫీ విత్ కరణ్‌పై ఎన్నో వివాదాలు నడిచినప్పటికీ.. ప్రేక్షకుల ఆదరించారు. నేను బయట కనిపిస్తే నా తదుపరి సినిమాలు, వాటి విశేషాల కంటే.. కాఫీ విత్ కరణ్ టాక్ షోలో నెక్ట్స్ గెస్ట్‌గా ఎవరిని తీసుకొస్తున్నారు? సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అని తెలుసుకోవడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. అలాంటి గొప్ప టాక్ షోను ఇకపై ముగిస్తున్నాను. కాఫీ విత్ కరణ్ టాక్ షో అక్టోబర్ 14 నుంచి జియో హాట్ స్టార్ వేదికగా ప్రసారమవుతుంది. ఇదే నా చివరి కాఫీ అంటూ కరణ్ జోహార్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు కూడా ఎమోషనల్‌గా స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
