Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karthika deepam 2 December 12th:కావేరి ఆహ్వానంపై కల్లోలం..కార్తీక్ సతమతం..!!

'కార్తీకదీపం 2' సీరియల్‌లో నేటి ఎపిసోడ్ (539వ ఎపిసోడ్) ఇంటి గుమ్మంలో మొదలై, ఇంట్లో ఉద్వేగభరితమైన గొడవలతో ముగిసింది. ముఖ్యంగా కాంచన మొండితనం, శౌర్య అమాయకత్వం, స్వప్న-కాశీల మధ్య పెరిగిన దూరం ఈ ఎపిసోడ్‌ను హైలైట్ చేశాయి.

శౌర్య చదువు - అనసూయ ఆగ్రహం
శౌర్య చదువులో వెనుకబడటంపై స్కూల్ మిస్ కార్తీక్‌కు ఫోన్ చేయడంతో, కాంచన శౌర్య బాధ్యతను తీసుకుంటుంది. కాంచన శౌర్యతో 'నువ్వు కలెక్టర్ అవ్వాలి' అని చెబుతుండగా, అనసూయ బొమ్మలు వేస్తున్న శౌర్యను చూసి కోపంతో కొట్టబోతుంది. అయితే కాంచన అడ్డుకుంటుంది. కార్తీక్ వచ్చి విషయం అడగగా, శౌర్య దాక్కుంటుంది. ఈ లోపు దీప వచ్చి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.

Karthika deepam 2 Serial December 12th Episode 539 Here is todays full story

కావేరి ఆహ్వానం - కాంచన మొండితనం
కావేరి (శ్రీధర్ భార్య) దీప, కార్తీక్‌లను టిఫిన్‌కు ఇంటికి ఆహ్వానించడానికి రావడంతో అందరూ ఆశ్చర్యపోతారు. కడుపుతో ఉన్న కోడలికి అత్తగారు వండిపెట్టడం ఆనవాయితీ అని చెప్పి, దీపకి అత్తగారుగా నువ్వు, నేను తప్ప ఎవరున్నారని కాంచనతో చెబుతుంది. దీప, కార్తీక్‌లు ఖచ్చితంగా వస్తారని కాంచన అంటుంది. కార్తీక్ కాంచనను కూడా ఆహ్వానించగా, గుడ్డు పులుసు తినాలని కాంచన సీరియస్‌గా నిరాకరిస్తుంది.

స్వప్న - కాశీల మధ్య భగ్గుమన్న గొడవ
ఆఫీస్‌కి ఆలస్యంగా వచ్చిన కాశీపై శ్రీధర్ మండిపడతాడు. ఈ సమయంలో స్వప్న రంగంలోకి దిగి కాశీపై విరుచుకుపడుతుంది. "మా నాన్న, అన్నయ్య ఆఫీసులో జరిగింది మొత్తం నాకు చెప్పారు. నువ్వు నాన్న దగ్గర పీఏగా చేయడం నీకు నామోషీగా ఉందా?" అని నిలదీస్తుంది. "మా నాన్న, అన్నయ్య లేకపోతే నువ్వు దేనికీ పనికిరావు" అంటూ ఘాటుగా మాట్లాడుతుంది. తన ఇంటిని నిర్వహించడానికి నెలకు ₹50 వేలు ఖర్చవుతుందని, రెండు నెలలు మెయింటైన్ చేయమని సవాల్ విసురుతుంది. "నిన్ను పెళ్లి చేసుకుంది నీ పొజిషన్ చూసి కాదు, నీ మంచితనం చూసి" అని చెప్పి, "నేనేంటో నా విలువ ఏంటో తొందరలోనే చూపిస్తానని" కాశీ సీరియస్ అవుతాడు.

అంతలో వచ్చిన కావేరి, ఉదయం నుంచి అలసిపోయి వచ్చిన కాశీతో గొడవ పడొద్దని స్వప్నను మందలిస్తుంది. "ఉంటే సైలెంట్‌గా ఉండు.. లేదంటే నీ మొగుడిని తీసుకుని బయటికిపో" అని కావేరి అనడంతో స్వప్న బాధపడుతుంది. ఇప్పుడే వెళ్ళిపోతానని, కానీ అల్లుడితో కాదని, ఒక్కదాన్నే పోతానని అనడంతో శ్రీధర్ కలుగజేసుకుని వారిని లోపలికి పంపిస్తాడు.

దీప, కాంచనల మధ్య కొత్త గొడవ
శ్రీధర్ ఇంటికి కాంచనను కూడా తీసుకెళ్లాలని కార్తీక్, దీపలు ప్రయత్నిస్తారు. కార్తీక్, అనసూయలు కాంచనను ఆహ్వానించగా, ఆమె 'నేను రాను' అని తేల్చిచెబుతుంది. "మీరు సరిగా తినకపోతే మావయ్య గారు నన్ను తిడతారని" దీప అనడంతో, శౌర్య కల్పించుకుని "అమ్మ అలిగితే నువ్వు తినిపిస్తావు కదా? అలాగే నానమ్మ తినకపోతే తాత తినిపిస్తాడని" అంటుంది.

శౌర్య మాటలు విని కాంచన సీరియస్ అవుతుంది. "ఈ మాటలన్నీ శౌర్య అన్నట్లు లేదు.. ఎవరో అనిపించినట్లుగా ఉందని" దీపను చూసి అంటుంది. "మీరు నన్ను చూసి ఎందుకు అంటున్నారని" దీప బాధపడుతూ కాంచన కాళ్లు పట్టుకుంటుంది. అయినప్పటికీ ఇద్దరూ తగ్గకుండా గొడవపడతారు. "ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు ఎంత తగ్గిస్తే అంత మంచిది" అని కాంచన కరాఖండీగా చెప్పేయడంతో, కార్తీక్ నిస్సత్తువతో తల పట్టుకుంటాడు. కార్తీక్, దీపలు కావేరి ఇంటికి వెళ్లేందుకు నిరాకరించాల్సి వస్తుంది.ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+